తాప్సీకి కరెంట్ షాక్.. మామూలుగా లేదుగా!  

Tapsee Gets Shock With Electricity Bill - Telugu Electricity Bill, Karthika Nair, Mumbai Electricity Board, Tapsee

టాలీవుడ్‌లో ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను ఆ తరువాత చాలా సినిమాలు చేసింది.తనదైన అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

 Tapsee Gets Shock With Electricity Bill

ఇక టాలీవుడ్‌లో వరుస ఫెయిల్యూర్ చిత్రాలతో సతమతమవుతున్న సమయంలో చాలా తెలివిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ అదిరిపోయే సక్సెస్‌ను చేజిక్కించుకుంది.ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్‌లో ఏ సినిమా చేసినా సక్సెస్ అయ్యే రేంజ్‌కు ఆమె వెళ్లిపోయింది.

కాగా ముంబైలోనే ఉంటున్న తాప్సీకి తాజాగా కరెంట్ షాక్ కొట్టిందనే వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.అయితే నిజంగా ఆమెకు కరెంట్ షాక్ కొట్టిందా అని ఆమె అభిమానులు ఆరా తీశారు.

తాప్సీకి కరెంట్ షాక్.. మామూలుగా లేదుగా-Gossips-Telugu Tollywood Photo Image

నిజానికి ఆమెకు ఎలాంటి షాక్ కొట్టలేదు.కానీ తనకు ముంబై విద్యుత్ శాఖ కరెంట్ షాక్ కొట్టినంత బిల్లును వేశారంటూ ఆమె వాపోయింది.

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలకు విద్యుత్ బిల్లుల రూపంలో మరింత షాక్‌ను తెప్పిస్తున్నారు ప్రభుత్వ అధికారులు.

ఈ క్రమంలోనే ఆమె ముంబైలో తీసుకున్న ఓ ఫ్లాట్‌కు ఏకంగా రూ.36 వేల బిల్లును వేశారు.అయితే ఆమె అందులో ఎప్పుడూ ఉండదని, కేవలం వారినికోసారి వచ్చి వెళ్తుందని అంటోంది.

తాను రిలాక్స్ అయ్యేందుకు మాత్రమే ఆ అపార్ట్‌మెంట్ తీసుకున్నానని, తాను దాంట్లో నివసించడమే లేదని, అలాంటి ఫ్లాట్‌కు ఇంత బిల్లు రావడం ఏమిటని ఆమె ప్రశ్నిస్తుంది.అయితే ఆమె ప్రశ్నలకు ముంబై విద్యుత్ శాఖ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం.

కాగా ఇటీవీల తమిళ బ్యూటీ కార్తీకా నాయర్‌కు కూడా దిమ్మతిరిగేలా విద్యుత్ బిల్లు వేశారు అక్కడి అధికారులు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tapsee Gets Shock With Electricity Bill Related Telugu News,Photos/Pics,Images..

footer-test