నన్నెవరు రేప్ చేయలేదు అంటున్న హీరోయిన్

అందాల తార తాప్సి మళ్ళీ ఫామ్ లోకి వస్తోంది.అయితే ఇప్పుడు బాలివుడ్ మీద ఎక్కువ ధ్యాస పెట్టింది ఈ అమ్మడు.

 Tapsee Denies Playing A Rape Victim In Pink-TeluguStop.com

బేబి లాంటి భారి హిట్ దొరికిన తరువాత తాప్సి జాతకంలో పెద్ద మార్పులే జరిగాయి.ఏకంగా అమితాబ్ బచ్చన్ తో నటించే అవకాసం వచ్చింది.

సుజీత్ సర్కార్ దర్శకత్వంలో అమితాబ్ తో తాప్సి కలిసి నటించిన ఈ చిత్రం పేరు “పింక్”.

ఈ చిత్రం యొక్క ప్రచారచిత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.

ఎటువంటి క్లూ వదలకపోయినా, “సెక్స్” వలన ఏదో ఒక పాత్ర ఈ సినిమాలో నష్టపోయింది అనేది మాత్రం కొద్దిగా అర్థమవుతోంది.

ఇక ఈ చిత్రంలో తాప్సి రేప్ విక్టిమ్ గా నటిస్తున్నట్లు ఒక జాతీయ పత్రిక రాసింది.

ఏదో ఊరికే రాస్తే వేరే విషయం, కాని స్వయంగా తాప్సి మాట్లాడినట్టుగా ఒక కల్పిత ఇంటర్వ్యూ ప్రచూరించేసింది.ఆ కల్పిత ఇంటర్వ్యూలోనే “నేను ఒక రేప్ విక్టిమ్ పాత్ర పోషించాను’ అని తాప్సి అన్నట్లుగా ఉంది.

అయితే ఈ విషయాన్ని తాప్సి పూర్తిగా ఖండించింది.పింక్ లో తాను చేసింది రేప్ విక్టిమ్ క్యారెక్టర్ కాదని, అసలు ఆ ఇంటర్వ్యూ కూడా తాను ఇవ్వలేదని, బాధ్యత ఉండాల్సిన జర్నలిజంకి ఏదో అయ్యిందని తాప్సి చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube