'రకుల్ నీ డ్రెస్ ఎవరు చింపేసారు' అంటూ సోషల్ మీడియాలో రకుల్ ఫోటోని ఎలా ట్రోల్ చేస్తున్నారో చూడండి!   Tapsee Comments On Rakul Preet Dress Instagram Post     2018-10-30   09:51:23  IST  Sainath G

చెరిగిన జుట్టు.. చిరిగిన ఫ్యాంటూ.. నలిగిన చొక్కా.. అరిగిన చెప్పు.. ఇప్పుడు ఇదే ఫ్యాషన్. చక్కగా తల దువ్వుకుని ఇస్త్రీ చొక్కా వేసుకునే ముఖాలు మెల్లగా సైడైపోతున్నారు. ఫ్యాషన్ ప్రభావంతో నయా ట్రెండ్‌లను ఫాలో అవుతూ.. చెదిరిన జుట్టు, చినిగిన దుస్తులే నేటి ట్రెండ్. స్టైల్‌గా కనిపించాలని తహ తహలాడే వాళ్లకోసం డిజైజన్లు ఈ మధ్య కాలంతో కత్తెరకు బాగా పనిచెప్తున్నారు. లేటెస్ట్ ట్రెండ్ పేరుతో జీన్స్ ఫ్యాంట్‌లకు ఎక్కడబడితే అక్కడ బొక్కలు పెట్టి.. వాటికి రిప్డ్‌ జీన్స్‌ అంటూ కొత్త రకం పేర్లు పెడుతున్నారు. వీటిలో స్కిన్నీ జీన్స్‌, స్కిన్‌ టైట్స్‌.. స్రైట్ కట్స్‌.. బ్యాగీ.. అబ్బో ఇందులో చాలా రకాలు ఉన్నాయి కాని జీన్స్‌కి బొక్కలు మాత్రం కామన్.

మొన్నటి వరకూ జీన్స్ ఫ్యాంట్ మాత్రమే మోకాళ్లు, తొడల భాగంలో ఈ రంధ్రాలు ఉండేవి.. ట్రెండ్ మారుతూనే ఉంటుంది కదా.. అందుకే కాస్త పైకి వచ్చారు.. ఫ్యాంట్‌కు ఉండగా లేనిది పై భాగంలో షర్ట్‌కి ఉంటే తప్పేముంది అనుకున్నట్టు ఉంది మన రకుల్. ఫిట్‌నెస్‌ అంటూ మరీ పలచగా తయారైందని సోషల్‌ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు మరోసారి ట్రోల్ల్స్ కి గురైంది.

Tapsee Comments On Rakul Preet Dress Instagram Post-

రకుల్‌… తాజాగా పోస్ట్‌ చేసిన ఓ పిక్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. మనలో ఉన్న చిన్నపిల్లల మనస్తతత్వాన్ని ఎప్పటికీ అలాగే ఉండనివ్వాలంటూ.. చిరిగిపోయిన డ్రెస్‌ వేసుకున్న పిక్‌ను పోస్ట్‌ చేశారు. అయితే ఈ పోస్ట్‌కు .. ‘నీ జాకెట్‌ను ఇంత ఘోరంగా చింపేసింది ఎవరు’ అంటూ తాప్సీ కామెంట్‌ చేయగా.. ‘నాలో ఉన్న చిన్నపిల్ల’ అంటూ చిలిపిగా రకుల్‌ రిప్లై ఇచ్చారు.

అయితే ఫ్యాన్స్‌ మాత్రం.. రకుల్‌ను ఓ ఆట ఆడేసుకున్నారు. బిచ్చగాళ్లే నయం ఇంతకంటే మంచి డ్రెస్సులు వేసుకుంటారని ఒకరు, నీ దగ్గర డ్రెస్‌లు లేకుంటే నాకు చెప్పు నేను ఇస్తానుగా అని ఇంకొకరు, చిరిగిన డ్రెస్‌లు వేసుకుంటే ఒకప్పుడు పిచ్చొళ్లని అనేవారని, కానీ ఇప్పుడు వాటినే బ్రాండ్‌ అంటున్నారని మరొకరు కామెంట్‌ చేశారు. అయితే ఆ డ్రెస్‌ బాగుందని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.