మొత్తానికి మూడో హీరోయిన్ ని సెట్ చేసుకున్న రవితేజ  

డిస్కో రాజాలో మూడో హీరోయిన్ గా ఫైనల్ అయిన తాన్యా హోప్.

Tanya Hope Fourth Chance With Ravi Teja-

మాస్ మహారాజ్ రవితేజకి రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లు వచ్చాయి.దీంతో ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో పీరియాడికల్ సైన్సు ఫిక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.ఈ సినిమా టైం మిషన్ నేపధ్యంలో మూడు కాలాలలో కథగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది...

Tanya Hope Fourth Chance With Ravi Teja--Tanya Hope Fourth Chance With Ravi Teja-

డిస్కో రాజా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజకి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ అవసరం ఉంది.ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ ఫైనల్ అయ్యారు.

ప్రస్తుతం వీళ్ళు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఇక మూడో హీరోయిన్ కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఫైనల్ గా హీరోయిన్ దొరికినట్లు తెలుస్తుంది.నేను శైలజా, పటేల్ సర్, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హాట్ బ్యూటీ తాన్యా హోప్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.

Tanya Hope Fourth Chance With Ravi Teja--Tanya Hope Fourth Chance With Ravi Teja-

ఈమె త్వరలో సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి నాలుగో ప్రయత్నంలో రవితేజ లాంటి స్టార్ హీరోకి జోడీగా అవకాశం అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాలి.