లైంగిక వేదింపులు అంటే ఏంటో నాకు తెలియదు.. ఆమె సంగతి చూస్తా!

బాలీవుడ్‌ మాజీ హీరోయిన్‌ తనూశ్రీ దత్తా చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది.ఈమె బాలీవుడ్‌ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత అయిన నానా పటేకర్‌పై సంచన ఆరోపణలు చేసింది.2008వ సంవత్సరంలో ఒక సినిమా షూటింగ్‌ సమయంలో నాకు డాన్స్‌ నేర్పిస్తాను అంటూ ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.నా ప్రైవేట్‌ పార్ట్‌లపై తాకడంతో పాటు, అత్యంత నీచంగా నాతో ప్రవర్తించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 Tanu Sri Dutta Comments On Nana Patekar-TeluguStop.com

తనపై లైంగిక దాడి చేసిన నానా పటేకర్‌పై ఇంకా పలు విమర్శలు చేసింది.

తనూశ్రీ దత్తా చేసిన విమర్శలు ప్రస్తుతం బాలీవుడ్‌లో హీట్‌ను పుట్టిస్తున్నాయి.కొందరు నానా పటేకర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మరి కొందరు మాత్రం ఆయన మంచి తనంను గుర్తు చేసుకుంటున్నారు.దాదాపు పది సంవత్సరాల తర్వాత తనూ శ్రీ ఆ విషయమై స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, అసలు తనూశ్రీ ఇప్పుడే ఎందుకు ఆ విషయాన్ని లేవనెత్తింది అంటూ నానా పటేకర్‌ అభిమానులు అడుగుతున్నారు.

తాజాగా ఈ విషయమై నానా పటేకర్‌ స్పందించాడు.

గత కొన్ని రోజులుగా ఈ విషయమై వివాదం పెరుగుతున్న కారణంగా ఎట్టకేలకు నానా పటేకర్‌ మీడియా ముందుకు వచ్చాడు.

తనపై వస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దం అన్నాడు.అసలు లైంగిక వేదింపులు అంటే ఏంటో తనకు అర్థం కావడం లేదు.

ఆమె చెబుతున్న సమయంలో మా చుట్టు 100 మంది ఉన్నారు.వంద మందిలో ఆమెపై తాను లైంగిక దాడి చేశాను అంటే ఎలా మీరు నమ్ముతున్నారో అర్థం కావడం లేదు.

నాకు ఈ విషయమై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.కాని ఒకటికి రెండు కల్పించి రాస్తున్నారు అనే ఉద్దేశ్యంతో తాను మీడియా ముందుకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.

తప్పులు చేసే నానా పటేకర్‌ వాటిని తప్పించుకునేందుకు సమాజ సేవ కలరింగ్‌ ఇస్తాడంటూ కూడా తనూశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది.తనూశ్రీ ఆ వ్యాఖ్యలపై నానా పటేకర్‌ స్పందిస్తూ.కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్ర రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో నేను ముందడుగు వేస్తున్నాను.నా గురించి ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను.కాని తనూశ్రీ దత్తా విషయంలో మాత్రం చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా నానా పటేకర్‌ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube