ఈ స్టార్ హీరోయిన్ చెల్లి కూడా తెలుగులో నటించిందని మీకు తెలుసా..?

బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రంలో హీరోయిన్ గా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే కాజోల్ పెళ్లి కాకముందు బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది.

 Tanisha Mukherjee Acted In Kantri Movie, Tanisha Mukherjee, Kajol, Bollywood Her-TeluguStop.com

ఆ తర్వాత మరో బాలీవుడ్ ప్రముఖ హీరో అయిన అజయ్ దేవగన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.ఆ తరువాత అడపాదడపా చిత్రాలలో కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోయింది.

దీంతో ఒక పక్క కుటుంబ బాధ్యతలు మరో పక్క సినిమా షూటింగులతో కొంతకాలం పాటు బిజీబిజీగా గడిపింది.

అయితే నటి కాజోల్ సోదరి కూడా తెలుగులో అడపాదడపా చిత్రాల్లో నటించిందని ఇప్పటికీ చాలామంది సినీ ప్రేక్షకులకు తెలియదు.

అయితే ఇంతకీ కాజోల్ సోదరి ఎవరు.? ఇంతకీ ఆమె నటించిన చిత్రాలు ఏమిటనే విషయం గురించి ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం….కాజోల్ సోదరి పేరు “తనీషా ముఖర్జీ”. ఈ అమ్మడు గురించి బాలీవుడ్ లో తెలియని వారుండరు.కాగా నటి తనీషా ముఖర్జీ బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 70 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.అంతేకాకుండా 20కి పైగా ధారావాహికలో కూడా నటించి ఇటు బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Telugu Bollywood, Kajol, Kantri, Telugu, Tollywood-Movie

కానీ తన సోదరి కాజోల్ మాదిరిగా మాత్రం సినిమా ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకోలేక పోయింది.కాగా నటి తనీషా ముఖర్జీ టాలీవుడ్ లో 2008వ సంవత్సరంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “కంత్రి” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలలో నటించే అవకాశాలు తలుపు తట్టినప్పటికీ సినిమా డేట్లు కుదరకపోవడంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టింది.

అయితే నటి తనీషా ముఖర్జీ బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో 7వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తృటిలో టైటిల్ ని చేజార్చుకుంది.

అంతేకాకుండా పలు డాన్స్ మరియు కామెడీ షోలలో కూడా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube