తనీష్‌కు తమ్ముడి దెబ్బ గట్టిగా తగలబోతుందా..     2018-09-13   13:27:09  IST  Ramesh P

తెలుగు ప్రేక్షకుల నుండి విశేష స్పందన దక్కించుకుంటున్న తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ షో ముగియబోతున్న నేపథ్యంలో పార్టిసిపెంట్స్‌కు సంబంధించిన బంధువులు కలిసేందుకు ఒక్కరొక్కరుగా వచ్చిన విషయం తెల్సిందే. సామ్రాట్‌కు ఆయన తల్లి రాగా, టీవీ9 దీప్తికి భర్త మరియు కొడుకు వచ్చారు. ఇక కౌశల్‌ కోసం పిల్లలు మరియు భార్య వచ్చారు. తనీష్‌ కోసం అతడి తమ్ముడు వచ్చాడు. ఇంటి సభ్యుల గురించి వచ్చిన వారు అంతా కూడా కొద్ది సమయం సరదాగా గడిపి పోయారు. కాని తనీష్‌ తమ్ముడు మాత్రం కౌశల్‌ పై తన మనసులో ఉన్న అక్కస్సును బయటకు కక్కి వెళ్లి పోయాడు.

తనీష్‌కు గట్టి పోటీ ఇస్తున్న వ్యక్తి కౌశల్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కౌశల్‌ లేకుంటే తనీష్‌ విన్నర్‌ అవుతాడని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తనీష్‌ తమ్ముడు కౌశల్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. కౌశల్‌పై ఈగ వాలినా ఊరుకోని కౌశల్‌ ఆర్మీ తనీష్‌ తమ్ముడిని సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ఏకి పారేస్తున్నారు. నువ్వు వెళ్లిన పని చూసుకుని వచ్చేయకుండా ఇలా మాట్లాడటం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు తనీష్‌ తమ్ముడు ఏమన్నాడంట.. దీప్తి కెప్టెన్సీ నుండి తొలగించిన సమయంలో ఆమెకు మద్దతుగా కౌశల్‌ అందరి ముందు మాట్లాడాడు. ఆ తర్వాత కెమెరా ముందుకు వెళ్లి దీప్తిని తొలగించడం వల్ల ఆ స్థానంలో నన్ను కెప్టెన్‌గా పెట్టాంటూ కౌశల్‌ కోరడం జరిగింది. దీన్ని తనీష్‌ తమ్ముడు తప్పుబట్టాడు. ఆ సమయంలో కౌశల్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా అతడు మాత్రం ఒప్పుకోలేదు. మొత్తానికి కౌశల్‌ ను టార్గెట్‌ చేసిన తనీష్‌ తమ్ముడు సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీకి టార్గెట్‌ అయ్యాడు. తనీష్‌కు అతడి తమ్ముడు చేసిన వ్యాఖ్యలు ఓట్ల విషయంలో గట్టి ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.