బాలీవుడ్ లో 'తన్హాజి' బయోపిక్, ఫస్ట్ లుక్ రిలీజ్

ఇటీవల ఒకరి జీవిత ఆధారముగా తెరెకెక్కుతున్న చిత్రాలు ఎంతగా ఆదరణ పొందుతున్నాయో తెలిసిందే.అటు బాలీవుడ్ లోనూ,టాలీవుడ్ లోనూ ఎక్కడ చూసినా ఈ బయోపిక్ ల హవా అలా కొనసాగుతూ ఉంది.

 Tanhaji First Look Release-TeluguStop.com

మొన్నటికి మొన్న స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం రిలీజ్ అయి అందరిని అలరించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో కూడా ఒక బయోపిక్ నడుస్తుంది.

అదే తన్హాజీ: ది ఆన్ సంగ్ వారియర్.అసలు ఎవరీ తన్హాజి అని అనుకుంటున్నారా.

మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో సేనాధిపతిగా ఉన్న సుబేదార్ తానాజీ మలుసరే ఈ తన్హాజీ.ఆయన జీవితం ఆధారణంగా తెరకెక్కుతున్న చిత్రమే ఇది.అయితే ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సైఫ్ ఆలీ ఖాన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.భారత చరిత్రలో కీర్తించని యుద్ధవీరుడు సుబేదార్‌ తానాజీ మలుసరే.

తన ప్రజలు, తన నేల తల్లి, తన రాజు ఛత్రపతి శివాజీ కోసం ఎంతగానో పోరాడారు తానాజీ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ కంటే కూడా చాలా గొప్పగా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.3డీ వ‌ర్షెన్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లవ్వగా, ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సైఫ్ అలీఖాన్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది.

Telugu Ajay Devagan, Bio, Bollywood Bio, Tanhaji, Tollywood Box-

  అజ‌య్ దేవ‌గ‌ణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా సైఫ్ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.అజ‌య్‌దేవ‌గ‌ణ్‌, భూష‌ణ్ కుమార్‌, కృష్ణ‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్నివ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం విడుద‌ల చేయ‌నున్నారు.ముందుగా ఈ చిత్రానికి తానాజీ అనే పేరు ఫిక్స్ చేశారు.కాని న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం తానాజీ అనే టైటిల్ త‌న్హాజీగా మార్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube