అమెరికాలో కాల్పుల కలకలం...!!!

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో జరిగిన కాల్పుల ఘటనతో మరో సారి అమెరికా ప్రజలు ఉలిక్కి పడ్డారు.గడిచిన రెండు నెలల కాలంలో అమెరికాలో కాల్పులు జరగడం ఇది నాలుగో సారి.

 Tanforanmall In San Bruno 1-TeluguStop.com

దాంతో ఒక్క సారిగా శాన్‌ఫ్రాన్సిస్కో వాతావరణం వేడెక్కింది.స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్ లో చొరబడిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాపిడ్‌ ట్రాన్సిట్‌ ప్రాంతంలోని షాపింగ్‌ మాల్‌లోకి చొరబడిన ఓ దుండగుడు కాల్పులకి పాల్పడ్డాడు.రోపలికి ప్రవేశించగానే తాను తెచ్చుకున్న ఆయుధాలతో అందరిపై కాల్పులు జరిపాడని, అందరూ తేరుకునే లోగానే ఇద్దరు ఈ కాల్పుల్లో చనిపోయారని కొంతమంది గాయాల పాలయ్యారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

అమెరికాలో కాల్పుల కలకలం!!! -  Tanfo

కాల్పుల అనంతరం దుండగుడు అక్కడి నుంచీ పరారయ్యాడని పోలీసులు తెలిపారు.కానీ కాల్పులు జరిపిన వ్యక్తి ఒకరు కాదని ఇద్దరు ఉన్నారని పోలీసులు తమ విచారణలో తేల్చారు.అయితే కాల్పులు ఎందుకు జరిపారనేది మాత్రం తెలియరాలేదని తెలుస్తోంది.తమకి దొరికిన ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టామని త్వరలో వారిని పట్టుకుంటామని పోలీసుల తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube