ప్రస్తుతం ఎక్కడ చూసినా తందూరి చాయ్‌ అంటున్నారు, అసలు దీని ప్రత్యేకత ఏంటీ?  

Tandoori Tea Is Now Trending On Social Media What Is This And How It Make - Telugu Social Media, Tandoori Tea,, Trending

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో తందూరి చాయ్‌ అదేనండి కుండ చాయ్‌కి సంబంధించిన వీడియోలు తెగ కనిపిస్తున్నాయి.మొన్నటి వరకు ఉత్తర భారతదేశంకే పరిమితం అయిన ఈ తందూరి చాయ్‌ ఇప్పుడు సౌత్‌ ఇండియాలో కూడా కనిపిస్తున్నాయి.

 Tandoori Tea Is Now Trending On Social Media What Is This And How It Make

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పదుల టీ స్టాల్స్‌లో ఈ తందూరి చాయ్‌ను ఇస్తున్నారు.విభిన్నమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా అవ్వడంతో కాస్త రేటు ఎక్కువ అయినా కూడా కొత్తది అంటూ ట్రై చేస్తున్నారు.

తందూరి చాయ్‌ని తాగిన వారు కొత్తగా ఉంది అంటూ అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు.ఆ చాయ్‌ చేస్తున్న విధానం అందరి దృష్టిని ఆకర్షించి ఒక్కసారి తాగాలి అనిపించేలా చేస్తుంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా తందూరి చాయ్‌ అంటున్నారు, అసలు దీని ప్రత్యేకత ఏంటీ-General-Telugu-Telugu Tollywood Photo Image

మామూలుగా టీ చేస్తారు.ఆ తర్వాత ఒక మట్టి కుండను నిప్పులపై బాగా వేడి చేసి ఆ తర్వాత ఆ టీని మట్టి కుండలో పోస్తారు.

దాంతో బాగా మరుగుతుంది.కొద్ది సమయం మరిగిన తర్వాత ఆ టీని మామూలుగా మట్టి కప్పుల్లో లేదంటే ఏదో ఒక కప్పుల్లో సర్వ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం తందూరి చాయ్‌ వీడియోలు సోషల్‌ మీడియాను తెగ షేక్‌ చేస్తున్నాయి.ఆ టీ సమీపంలో లేని వారు కనీసం ఆ వీడియోను అయినా చూసి ఆనందించేద్దాం అన్నట్లుగా చూస్తున్నారు.

ఏరియాను బట్టి ఒక్క టీ 20 నుండి 50 రూపాయలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పీడ్‌గా ఈ తందూరి చాయ్‌ స్టాల్స్‌ పెరుగుతున్నాయి.

పెద్దగా పెట్టుబడి లేకపోవడంతో పాటు కొత్తగా ఉందని చాలా మంది ట్రై చేస్తున్నారు కనుక మీకు ఏమైనా ఆలోచన ఉంటే లేదంటే మీ వారు ఎవరైనా టీ స్టాల్‌ నడిపిస్తూ ఉంటే వెంటనే ఈ సలహాను చెప్పండి.రెండు మూడు వేల అదనపు పెట్టుబడి పెడితే ఈ తందూరి చాయ్‌ స్టాల్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.మరిన్ని వివరాల కోసం నెట్‌ లో తందూరి చాయ్‌ అని కొడితే చాలు.చాలా చాలా మ్యాటర్‌ వస్తుంది.మరెందుకు ఆలస్యం ఈ విషయాన్ని మరింత మందికి చేరేలా షేర్‌ చేసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tandoori Tea Is Now Trending On Social Media What Is This And How It Make Related Telugu News,Photos/Pics,Images..

footer-test