తానా ప్రపంచ స్థాయి కవితల పోటీ..మొదటి బహుమతిగా...!!!

అమెరికాలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా )గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.అమెరికాలో తెలుగు వారికోసం, తెలుగువారి అభివృద్ధి కోసం, అన్ని రకాలుగా తెలుగువారికి సేవలు చేయడానికి ఏర్పడిన అచ్చతెలుగు సంస్థ.

 Tana World Class Poetry Competition First Prize  Tana, Tana Poetry Competition,-TeluguStop.com

తెలుగు సంస్కృతిని, తెలుగు పండగలని ఎంతో వైభవంగా స్వదేశంలో జరిగిందా అనేట్టుగా నిర్వహించడంలో తానా కి ప్రత్యేకమైన శైలి ఉంది.అమెరికా వ్యాప్తంగా తెలుగు వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారన్నా సాయం అందిస్తుంది.

ఎప్పటికప్పుడు తెలుగువారిని ఏకం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉంటుంది.ఈ క్రమంలోనే తానా ప్రపంచ స్థాయి కవితల పోటీలకి ఆహ్వానాన్ని పలుకుతోంది.

ఆగస్టు 19 న ప్రపంచ స్థాయి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ స్థాయి కవితల పోటీలకి ఆహ్వానాలు అందించింది.ఈ విషయాన్ని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి ప్రకటించారు.

ఈ పోటీలో ఎలా పాల్గోనాలి, ఎలాంటి నియమ నిభందనలు ఉన్నాయి.గెలుపొందిన వారికి బహుమతులుగా ఏమి ఇవ్వనున్నారు అనే విషయాల్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ పోటీలో మొదటి బహుమతి విజేతకి రూ.30వేలు, రెండవ బహుమతి విజేతకు రూ.20 వేలు, మూడవ బహుమతి విజేతకు రూ.10వేల రూపాయలతో పాటు మరో 10 మంది విజేతలకి 4 వేల రూపాయలని అందించనున్నారు.ఇక.

ఏ ఫోటోల ఆధారంగా కవితలు రాయలు అనేది ఇవ్వబడింది.పైన ఉన్న రెండు ఫోటోలని సమన్వయము చేసుకుంటూ కవిత రాయాలు, కవితలు 20 పక్తులు మించ కూడదు.ఒక్కొక్కరు ఒక్కో కవితని మాత్రమే పంపాలి, కవిత రాసిన తరువాత అందులో మీ వాట్సాప్ నెంబర్ కూడా పంపండి.

మీరు రాసినకవితలు మీరు రాసినవే అనేట్టుగా ఓ దరఖాస్తు కూడా అందించాలి, కవితలను జులై 26-2020 లోగా పంపాలి, కవితల విన్నర్స్ ఆగస్టు 15 వ తేదీన ప్రకటిస్తారు.

మరిన్ని వివరాలకోసం www.tana.org

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube