తానా ఆధ్వర్యంలో మార్చ్ 16 న మహిళా దినోత్సవం వేడుకలు..!!  

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద సంఘంగా ఉన్న తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఎన్నో కార్యక్రమాలని తెలుగు పండుగలని నిర్వహిస్తూ ఉంటుంది. అయితే వచ్చే నెల అనగా మార్చి 16 న మహిళా దినోత్సవం సందర్భంగా అస్టిన్ లో వేడుకలు జరుపనున్నారు.

TANA Women's Day Austin 2019 Celebrations In USA-Tana Tana Usa Telugu Nri News Updates

TANA Women's Day Austin 2019 Celebrations In USA

ఏసియన్‌ అమెరికన్‌ రిసోర్స్‌ సెంటర్‌లో ఈ వేడుకలు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు జరుగుతాయని తానా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో ఫన్‌ గేమ్స్‌…ఫ్యాషన్‌ షో.. నాటికలు…డబ్‌ స్మాష్ తో పాటుగా పలు రకాల కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఈ వేడుకల్లో వాణిజ్య సంస్థలు స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ సందర్భంగా అవార్డులు ,రివార్డులు , పాటలు ,డీజే లతో ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. మహిళలు అందరూ పాల్గొని ఈ వేడుకలని విజయవంతం చేయాలని. తానా తెలిపింది. ఈ వేడుకలకి ఉండవల్లి కన్‌స్ట్రక్షన్స్‌ స్పాన్సర్ గా ఉండగా ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించడానికి సిద్దమవుతోంది.