తానా తెలుగు మహాకవి సమ్మేళనం - 2021

ప్రపంచ దేశాలలో సైతం తెలుగు వెలుగుల పూస్తున్నాయంటే అందుకు కారణం ఆయా దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళు , సంఘాలు.వారు స్వదేశం వచ్చినా విదేశంలో ఉన్నా తెలుగు బాషాభివ్రుద్దికి శ్రమించే తీరు ఎంతో అబ్బురపరుస్తుంది.

 Tana Telugu Mahakavi Sammelanam 2021-TeluguStop.com

ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచంలోనే తెలుగు వారు ఏర్పరుచుకున్న అతిపెద్ద సేవా చైతన్య వేదిక.తెలుగు బాషాభివృద్దిని భుజానా వేసుని పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుంటుంది.

తాజాగా ఉగాది పర్వదినం పురస్కరించుకుని తెలుగు ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో తెలుగు మహా కవి సమ్మేళనం -21 అనే కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా సోషల్ మీడియా వేదికగా నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్ వెల్లడించారు.

 Tana Telugu Mahakavi Sammelanam 2021-తానా తెలుగు మహాకవి సమ్మేళనం – 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తానా ఏర్పాటు చేయనున్న ఈ సాహిత్య వేదిక ఎంతో మంది తెలుగు బాషాభిమానులకు స్పూర్తి వంతంగా నిలుస్తుందని, తెలుగు బాష అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ కార్యక్రమాన్ని ఏప్రియల్ శనివారం , ఆదివారం అంటే 10,11, తేదీలలో నిర్వహిస్తామని తానా అధ్యక్షులు తాళ్ళూరి జయ శంకర్ ప్రకటించారు.

Telugu Talluri Jaya Shanker, Tana, Thotakura Prasad, Ugadi-Telugu NRI

తానా ఏర్పాటు చేస్తున్న కవి సమ్మేళనానికి దాదాపు 21 దేశాలలో ఉన్న 21 తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొనన్నారని, ఈ ప్రతిష్టాత్మక కవి సమ్మేళనం కవితా గానం, అతిధుల సందేశాలతో నిర్వహించ బడుతోందని తెలుస్తోంది.ఈ కవి సమ్మేళనం దాదాపు 21 గంటల పాటు నివహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా తెలుగు బాషను అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు బాషాభిమానులను ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుందని, తెలుగు బాషా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తమ లక్ష్యమని తానా అధ్యక్షులు తాళ్ళూరి జయ శంకర్ తెలిపారు.

#Ugadi #TANA #TalluriJaya

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు