“తానా” తెలుగు సాంస్కృతిక వేడుల షెడ్యూల్ విడుదల..!!!

అమెరికాలో తెలుగు వారి కోసం ఏర్పడిన సంస్థ తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం).తానాతో పాటుగా ఎన్నో సంస్థలు ఉన్నా తానాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.

 Telugu Association Of North America,tana, Celebrations, America, Schedule,jay Ta-TeluguStop.com

ఎంతో మంది తెలుగు వారితో కలిసి ఏర్పడిన సంస్థగా పలు సేవా, చైతన్య కార్యక్రమాలు చేస్తూ అమెరికాలోను తెలుగు రాష్ట్రాలలో పలు సేవలు అందిస్తోంది.తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలు, పండుగలు, వేడుకలు ఇలా తెలుగు వెలుగులు అమెరికాలో వ్యాప్తి చెందేలా తానా చేసే కృషి అనిర్వచనీయమనే చెప్పాలి.

తాజాగా తానా తెలుగు సాంస్కృతిక మహోత్సవం వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించనుంది.అందుకు సంభందించిన షెడ్యూల్ విడుదల చేసింది…వివరాలలోకి వెళ్తే.

తెలుగు బాషా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు తెలుగు సాంస్కృతిక మహోత్సవం ని నిర్వహిస్తున్నామని ఈ వేడుకలో సుమారు 50 తెలుగు సంఘాలు పాల్గొననున్నాయని వివిధ అంశాలకి సంభందించి కార్యక్రమాలు రూపొందించామని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి ప్రకటించారు.సౌందర్య లహరి, తెలుగు వెలుగు, నాదామృతం , అందెల రవళి, కళాకృతి , రంగస్థలం, భువన విజయం పేర్లతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

తెలుగు వెలుగు పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు పద్యాలు సామెతలు, వివరణలు, పరాయి బాష పలుకకుండా తెలుగు పలుకులు, తెలుగు పలుకులు, కవితా గానం, వంటివి ఏర్పాటు చేశారు.ఇక నాద మృదంగం, వయోలిన్, తబలా, లలితా గీతాలు, శాస్త్రీయ గీతాలు, తెలుగు పలుకులు ఏక పాత్రాభినయం, ముఖాభినయం జానపద నటనలు, నృత్యాలు, ఏర్పాటు చేశారు.

అంతేకాదు తెలుగు ఐక్యరాజ్య సమితి పేరుతో ఓ విభిన్నమైన నాటకానని రూపొందించారు.తెలుగు కళాకృతులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శనకి పెట్టనున్నట్టుగా జయ్ తాళ్ళూరి ప్రకటించారు.

అయితే ఈ వేడుకలు అన్నీ జులై 24, 25,26 తేదీలలో ఎంతో వైభవంగా జరగనున్నట్టు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube