తానా హెల్ప్ లైన్ సౌకర్యం..!!!

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో తానా కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.అత్యధిక మెంబెర్స్ ని కలిగిఉన్న ఏకైక తెలుగు సంఘం తానా అని చెప్పడంలో సందేహం లేదు.

 Tana Started Help Line 1-TeluguStop.com

తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలని గౌరవించడంలో, ఆచరణలో పెట్టి భావి తరాలకి తెలియచేప్పడంలో తానా ఎప్పుడూ ముందుంటుంది.అమెరికాలో నివసించే తెలుగు వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

తానా హెల్ప్ లైన్ సౌకర్యం!!! -  Tana

ఈ క్రమంలోనే తానా మరిన్ని సేవా కార్యక్రమాల రూప కల్పన చేస్తోంది.అందుకు అనుగుణంగా హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసింది.ఈ హెల్ప్ లైన్ ద్వారా అత్యవసర సేవలని క్షణాలలో జరిగేలా ప్రణాలికలు సిద్దం చేసింది.ఆపదలో ఉన్న తెలుగు వారి కోసం ఈ సేవలని ప్రారభించినట్టుగా ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే ఈ సేవలు టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టుగా టీమ్ స్క్వేర్ అధ్యక్షుడు కొల్లా అశోక్ బాబు తెలిపారు.

1855 OUR TANA అనే టోల్ ఫ్రీ నెంబర్ కి తెలుగు వారు ఎవరైనా సరే ఎలాంటి ఆపదలో ఉన్నా సరే ఫోన్ చేయవచ్చని ప్రకటించారు.ఈ సేవలు కేవలం తానా టీమ్ స్క్వేర్ మాత్రమే కాకుండా తానాలో ఉన్న అడ్హాక్ కమిటీలు కూడా పాల్గొంటాయని అశోక్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube