తానా “SAT” శిక్షణపై ప్రవాసుల ప్రశంసలు...

తానా “SAT” శిక్షణపై ప్రవాసుల ప్రశంసలు…

అమెరికా కాలేజీలలో చదువుకోవాలంటే తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ SAT (Scholastic Assesment Test ) టెస్ట్ రాయాల్సిందే అందులో క్వాలిఫై అవ్వాల్సిందే.అలాంటి ఈ SAT టెస్ట్ పై ఆగాహన కలిగిస్తే మన తెలుగు వారికి ఎంతో ఉపయోగపడుతుందని భావించిన తానా అనుకున్నదే తడవుగా తెలుగు వారి పిల్లల కోసం SAT టెస్ట్ పై నిపుణులైన వారితో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది.

 తానా “sat” శిక్షణపై ప్రవాసుల ప్రశంసలు…-TeluguStop.com

దాదాపు ఐదు వారాల పాటు సాగిన ఈ కార్యక్రమాలో పెద్ద ఎత్తున విద్యార్ధులు పాల్గొన్నారు.SAT లో అత్యుత్తమమైన ప్రతిభ కనబరచాలంటే ముందస్తుగా ఎలా ప్రిపరేషన్ ఉండాలి, ఏం చదవాలి అనే విషయాలపై తానా ఏర్పాటు చేసిన ఈ కార్య్రక్రమం అతిపెద్ద సక్సస్ అయ్యిందని తానా సభ్యులు తెలిపారు.

వివరాలోకి వెళ్తే.

 తానా “SAT” శిక్షణపై ప్రవాసుల ప్రశంసలు…-తానా “SAT” శిక్షణపై ప్రవాసుల ప్రశంసలు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిత్యం ఏదో ఒక సామాజిక సేవా, విద్యార్ధి విద్య, నైపుణ్య, ఆరోగ్య ఇలా అనేకరకాల కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే ఏర్పాటు చేసినదే SAT టెస్ట్ పై అవగాహన కార్యక్రమం.ఇందుకుగాను నిపుణులైన గారపాటి హాసిత్ ను విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు ఆహ్వానించారు.దాదాపు 400 మంది విద్యార్ధిని, విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఒక్కొక్క సెషన్ కు ఒక్కో రంగ నిపుణులను భోధన కోసం ఏర్పాటు చేయడంతో విద్యార్ధులు తమకు ఉన్న సందేహాలను తెలుసుకుంటూ ఎంతో ఉశ్చాహంగా పాల్గొన్నారు.ఇదిలాఉంటే

శిక్షణ పూర్తయిన తరువాత విద్యార్ధుల తల్లి తండ్రులు తానా కు కృతజ్ఞతలు తెలిపారు.SAT శిక్షణ ఏర్పాటు చేయడం అంత సులభం కాదని, తెలుగు వారి కోసం, తమ పిల్లల కోసం తానా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఈ కార్యరమంలో పాల్గొన్న వారికి, ట్యూటర్ గారపాటి హాసిత్ కు కృతజ్ఞతలు తెలిపారు.త్వరలో ACT (American College Test) పై కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

#TANA SAT #TANA #SAT #Test #SAT

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube