'తానా'... సెక్రటరీ, ట్రెజరర్‌, జాయింట్‌ సెక్రటరీలుగా..!!!  

Tana New Secretary And Joint Secretary-tana,tana New Joint Secretary,tana New Secretary,telugu Nri News Updates

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద సంఘంగా పేరొందిన తానా సంఘం 2019-21 సంవత్సరానికి గాను తానాలో కొన్ని కీలక పదవులని భర్తీ చేసింది. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నికల్లో ఉత్త అమెరికా తెలుగు సంఘం (తానా) సెక్రటరీగా రవి పొట్లూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన ఫిలడెల్ఫియాలో ఉంటారు. ముందు నుంచీ తానాలో వివిధ పదవులని చేపడుతూ వచ్చారు..

'తానా'... సెక్రటరీ, ట్రెజరర్‌, జాయింట్‌ సెక్రటరీలుగా..!!!-TANA New Secretary And Joint Secretary

అలాగే ఇవే ఎన్నికల్లో కాలిఫోర్నియా కి చెందినా వెంకట్ కోగంటి ని జాయింట్ ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆయన ఒకరే ఈ పోస్టుకు నామినేషన్‌ దాఖలు చేయడంతో. పోటీ దారులు ఎవరూ లేక ఆయన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

అదేవిధంగా ఒహాయో రాష్ట్రానికి చెందిన అశోక్‌బాబు కొల్లాని తానా జాయింట్‌ సెక్రటరీగా ఎంపిక చేశారు. అయితే అశోక్ బాబు ఎంపిక కూడా ఏకగ్రీవంగా జరగడం గమనార్హం.

ఇలా ముగ్గురు అభ్యర్ధులు ఏక కాలంలో ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు.తానా అభివృద్దికి , తానా ద్వారా జరగబోయే సేవా కార్యక్రమాలని ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తామని వారు తెలిపారు.

3 Attachments