తానా కృషి ఫలితం..40 మంది విద్యార్ధుల విడుదల..!  

అమెరికాలో నకిలీ వీసా వివాదంలో అరెస్ట్ అయిన భారతీయులని అక్కడ ఉన్న తెలుగు సంఘాలు ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాయి. భారతీయ విద్యార్ధులకి ఎటువంటి ప్రమాదం లేదని చెప్తూ వారి తల్లి తండ్రులకి భరోసా ఇచ్చాయి. అందులో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా రంగంలోకి దిగింది.

తానా తన తొలి ప్రయత్నం లో విజయం సాధించింది. 129 మందిలో 40 మంది విద్యార్థులను బెయిల్‌పై విడుదల చేయించింది..అయితే మిగిలిన వారిని కూడా విడుదల చేయాలనీ అంటూ తానా అధ్యఖ్సుడు సతీష్ వేమన టీం అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ శృంగ్లాను కలిసింది. ఆయనతో పాటు ఇతర కాన్సుల్‌ జనరళ్లను, 17 మంది అమెరికా కాంగ్రెస్‌ సభ్యులను కూడా తానా కలిసింది.

వీరిని కలిసిన సందర్భంగా సతీశ్‌ వేమన మాట్లాడుతూ భారత విద్యార్థుల అరెస్టు అంశం చాలా క్లిష్టమైనదని . భారతీయులు త్వరగా విడుదల కావాలి అంటే తప్పకుండా ప్రభుత్వం చురుకైన పాత్ర పోషించాలని అన్నారు..ఈ సమావేశంలో తానా క్రియాశీలక సభ్యులు అందరూ పాల్గొన్నారు.