అమెరికాలో విద్యకి తానా సాయం

తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అమెరికా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలని చేపడుతూ ఎంతో మంది తెలుగు ఎన్నారైల మద్దతు కూడగట్టుకుని అతి పెద్ద తెలుగు సంస్థగా అమెరికాలో విస్తరించింది.అమెరికాలో ఉండే తెలుగు వారికి మాత్రమే కాకుండా స్వదేశంలో సైతం తానా తన వంతు సేవాకార్యక్రమాలు అందిస్తోంది.

 Tana Help For Students 1-TeluguStop.com

తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలని కాపాడటమే కాకుండా ఎంతో మంది విద్యార్ధులకి విద్యకి ఆటంకాలు లేకుండా ఉపకార వేతనాలు అందిస్తోంది.

అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసించడానికి వచ్చే ఎంతో మంది విద్యార్ధులకి అలాగే అమెరికాలోనే ఉండే స్థానిక తెలుగు విద్యార్ధులకి సైతం ఉపకార వేతనాలు అందిస్తోంది.

తెలుగు రాష్ట్రాల నుంచీ వచ్చే విద్యార్థుల ధరఖాస్తుల నుంచీ అర్హులైన ఏడుగురిని ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికి సెమిస్టర్‌కు $500 చొప్పున నాలుగు సెమిస్టర్లకు $2000లను అందిస్తోంది.అయితే

ప్రతీ సెమిస్టర్ కి ఆశాజనకమైన మార్కులతో పాస్ అయిన వారికి మాత్రమే తదుపరి వేతనం అందిస్తారు.

అంతేకాదు ధరఖాస్తును అమెరికా రాకముందే తగిన ధృవీకరణ పత్రాలతో తానా ఫౌండేషన్ కి అందించాల్సి ఉంటుంది.ఇక అమెరికాలోనే పుట్టి పెరిగి కాలేజీలకి వెళ్ళే నలుగురు విద్యార్ధులకి $1000 చొప్పున ఉపకార వేతనాలు అందిస్తారు.

ఈ వేతనాల కోసం తానా వెబ్సైటు ని సంప్రదించవచ్చు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube