ప్రపంచ స్థాయి కవితల పోటీకి “తానా” ఆహ్వానం  

Tana Fathersday Poetry Competition - Telugu America, Fathers Day, Poetry Competitions, Tana, Tana Worldwide Poetry Competition

అమెరికాలో తానా పేరు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఉత్తర అమెరికా తెలుగు సంఘంగా అమెరికాలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న అతిపెద్ద తెలుగు సంఘంగా ఏర్పడింది.

 Tana Fathersday Poetry Competition

అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి విశిష్ట సేవలు అందిస్తోంది.అంతేకాదు తానా చేపట్టే వివిధ కార్యక్రమాలని అనుగుణంగా సేవా విభాగాలు కూడా ఏర్పాటు చేసింది.

అందులో భాగంగానే తానా ప్రపంచ సాహిత్య వేదికను ఏర్పాటు చేసి ఎంతో కాలంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ప్రపంచ స్థాయి కవితల పోటీకి “తానా” ఆహ్వానం-Telugu NRI-Telugu Tollywood Photo Image

జూన్ 21 -2020 న పితృ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కవులకి కవితల పోటీలకి గాను ఆహ్వానం పంపుతోంది.

“ఘనుడు నాన్న – త్యాగ ధనుడు నాన్న” అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో తెలుగు కవితల పోటీలు నిర్వహిచడానికి సర్వం సిద్దం చేస్తోంది.ఇండియా నుంచీ చిగురుమళ్ళ శ్రీనివాస్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారని తానా అధ్యక్షులు జయ శేకర్ తాళ్ళూరి ప్రకటించారు.ఈ పోటీలకి సంభందించిన పూర్తి వివరాలు పొందు పరిచారు.

    నియమాలు

  • పంపే కవితలు 20 పంక్తులు మించకుండా ఒకే పేజీలో ఉండేలా పంపాలి.
  • కవితతో పాటు మీ ఫోటో కూడా పంపాలి.
  • ఒక కవి ఒక కవితనే పంపాలి.
  • కవితతో పాటు మీ వాట్సాప్ నెంబర్ కూడా పంపాలి.
  • ఈమెయిల్ ఐడీ , కవి చిరునామా, ఈ కవితని మీరు రాసినట్టుగా కవిత కింద సంతకం చేసి పంపాలి.
  • కవితలు చేరవాల్సిన గడువు :: 15-06 -2020
  • ఇమెయిల్ : [email protected]
  • కవితలు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ : 91210-81595

పోటీలో ప్రధమ విజేతకు రూ.10,116/- , రెండవ బహుమతి రూ.7,116/- మూడవ బహుమతి రూ.5,116 మరిన్ని వివరాలకోసం www.tana.org

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tana Fathersday Poetry Competition Related Telugu News,Photos/Pics,Images..

footer-test