తానా : అమెరికాలో తెలుగు వారందరూ క్షేమమే  

Tana Executive Vice President Jayasekhar America Coronavirus - Telugu Coronavirus, Nri, Talluri Jayasekhar, Tana

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 2000 మంది పైగానే మృతుల చేరుకున్నారు.

 Tana Executive Vice President Jayasekhar America Coronavirus

ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష పైగానే ఉండటంతో అగ్ర రాజ్యంలో ఆందోళనలు మొదలయ్యాయి.ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.

కరోనా ప్రభావం చైనాపై విపరీత చేష్టలు చేసిన సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే ఇలాంటి దారుణం జరిగేది కాదని అమెరికా సమాజం దుమ్మెత్తి పోస్తోంది…ఇదిలాఉంటే
ఎంతో మంది తెలుగు రాష్ట్రాలకి చెందిన ఎన్నారైలు అమెరికాలో ఉంటున్నారు.వారి పరిస్థితి ఎలా ఉన్నదో తెలియక భంధువులు, స్నేహితులు కలవర పడుతున్నారు ఈ క్రమంలోనే అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అధ్యక్షుడు తాళ్ళూరి .జయ్ శేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.అమెరికాలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారందరూ క్షేమంగా ఉన్నారని, వారి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

తానా : అమెరికాలో తెలుగు వారందరూ క్షేమమే-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇప్పటికే తెలుగు వారందరినీ కరోనా విషయంలో పూర్తిగా అలెర్ట్ చేశామని, కరోన రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని భారత కాన్సులేట్లతో కలిసి వివరించి చెప్పామని అన్నారు.కరోనా విషయంలో ఇప్పటి వరకూ తెలుగు వారు ఎవరూ తమకి ఎలాంటి ఫోన్ కాల్స్ చేయలేదని, ఎవరికి వారు స్వీయ నిర్భందంలో ఉన్నారని అన్నారు.తెలుగు వారందరూ బయటకి రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tana Executive Vice President Jayasekhar America Coronavirus Related Telugu News,Photos/Pics,Images..