అమెరికాలో మరో ఎన్నికల సమరం..తెలుగువారికి మాత్రమే..!!!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసిపోయాయి కదా మళ్ళీ ఎన్నికలు ఏంటి.అది కూడా తెలుగు వారికి మాత్రమే జరగడమేమిటి అనుకుంటున్నారా.

 Tana Elections Will Be Soon For Telugu Nri People, Tana, Telugu Assosiation Nort-TeluguStop.com

అవును మీరు విన్నది నిజమే అమెరికాలో ప్రస్తుతం తెలుగు వారికి మాత్రమే ఈ ఎన్నికలు జరగనున్నాయి కాకపొతే ఈ ఎన్నికలు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలు.అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా ఉంటూ తెలుగు వెలుగుల కోసం, ఏర్పాటు చేయబడిన తెలుగు సంస్థ ఈ తానా.

రెండేళ్ళ కు ఒక సారి జరగే ఈ తానా ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతాయి.

తానా సంస్థలో పదవులు చేపట్టడాన్ని తెలుగువారు ఎంతో గొప్పగా, గౌరవంగా భావిస్తారు.

ఈ ఎన్నికల ప్రకటన వచ్చే ముందే పోటీ చేయాలనుకునే వారు ప్రణాళికలు ఆరు నెలల ముందునుంచే సిద్దం చేసుకుంటూ ఉంటారు.పరిస్థితులు, సభ్యులు, తెలుగు వారు తమకు మద్దతు తెలిపేలా ముందు నుంచే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఈ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనే విషయం ప్రస్తుతానికి ప్రకటించక పోయినా ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్ధులు ప్రచారం కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Tana, Telugu America, Telugu Nri Ups-Telugu NRI

తానాలో కీలకమైన అధ్యక్ష పదవికి ఇప్పటికే నలుగురు అభ్యర్ధులు పోటీ పడుతున్నారని, వారు సభ్యుల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారని అంటున్నారు నిర్వాహకులు.అసలు ఈ సంస్థలో ఎన్నికలకు అంత పోటీ ఎందుకంటె.తానా ప్రపంచంలో ఉన్న అన్ని తెలుగు సంఘాలకు మార్గదర్సకంగా వ్యవహరిస్తుంది.

అమెరికాలో ఎన్ని సంఘాలు ఉన్నా తానాకి ఉన్న గుర్తింపు, తానా చేపట్టే కార్యక్రమాలు అన్నీ విశేషంగా ఉంటాయి.తానా ఎటువంటి కార్యక్రమం చేపట్టిన అందులో తెలుగుదనం ఉట్టిపడేలా, తానా మార్క్ ఉండేలా చేయడంలో తనకు తానె సాటి అని నిరూపించుకుంటుంది.

అందుకే తానా ఎన్నికలలో పోటీ చేయడానికి అమెరికాలో తెలుగు వాళ్ళు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ సారి జరగనున్న ఎన్నికల్లో తానాకు అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube