మే 29న తానా ఎన్నికల ఫలితాలు....!!

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.కేవలం అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలలో అతి పెద్ద తెలుగు సంఘం తానానే.

 Tana Elections Result May 29th-TeluguStop.com

ప్రస్తుతం అమెరికాలో తానా ఎన్నికల హడావిడి హోరాహోరీగా ఉంది.గతంలో తానా ఎన్నికలు ఏక పక్షంగా అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎంపిక అతడిని తానా అధ్యక్షుడిగా ప్రకటించే వారు కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది.

ఈ సారి ఎన్నికలు ఏకపక్షంగా జరగడానికి వీలు లేదని ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుబడ్డారు.దాంతో ఎన్నికలు పెట్టక తప్పలేదు.

 Tana Elections Result May 29th-మే 29న తానా ఎన్నికల ఫలితాలు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తానాలో ఓట్ల ద్వారా అభ్యర్ధులను ఎన్నికోవడం మొదటి సారిగా పెట్టడంతో సర్వాత్రా ఆసక్తి నెలకొంది.అధ్యక్ష బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్ధులు నువ్వా నేనా అన్నట్టుగా పోటీలు పడటమే కాకుండా ప్రచారం ముమ్మరం చేశారు.

తానా లో సభ్యులుగా ఉంటూ ప్రస్తుతం ఎన్నికల్లో ఓట్లు వేసేవారు 34వేల మంది ఉన్నారని.వీరందరూ దాదాపు 18వేల కుటుంభాలకు చెందిన వారని తెలుస్తోంది.ఈ ఓటర్లు అందరికి ఈ నెల 15వ తేదీ నుంచీ బ్యాలెట్ పత్రాలను పోస్టల్ ద్వారా పంపుతామని, మార్చ్ 25 నాటికి ఓటర్లు అందరికి బ్యాలెట్ ఓట్లు చేరుతాయని, తానా ఎన్నికల నిర్వహణ అధికారి తెలిపారు.

మే 28 వరకూ తానా ఓటర్ సభ్యుల నుంచీ బ్యాలెట్ పత్రాలను తీసుకుంటామని బ్యాలెట్ పాత్రాల ఓట్ల లెక్కింపును సియాటెల్ లో ఓ సంస్థకు అప్పగించామని సదరు సంస్థ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

మే 29 ఉదయం నుంచీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు మొదటి సారి ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టమని ఫలితాలు నిస్పక్షపాతంగా ఉంటాయని తానా ఎన్నికల నిర్వాహకులు తెలిపారు

#TANAElections #TANAPresident #TANA #TANA Elections #America

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు