తానా అధ్యక్ష ఎన్నికలు..బరిలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!  

TANA Elections in 2021, America, Indians, NRIs, TANA Foundation Executive Vice President Niranjan - Telugu America, Indians, Nris, Tana Elections In 2021, Tana Foundation Executive Vice President Niranjan

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)అంటే తెలియని వారు ఉండరు.ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద తెలుగు సంఘం తానా.

TeluguStop.com - Tana Elections 2021 America

అమెరికాలోని తెలుగు వారి సంక్షేమం కోసం, తెలుగు కుటుంభాల కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థ అమెరికాలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో తన విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంటుంది.అమెరికాలో మన తెలుగు సంస్కృతిని చాటిచెప్తూ, తెలుగు పండుగలను భవిష్యత్త్ తరాలకు అర్థమయ్యేలా, పాటించేలా నిర్వహిస్తుంది.

అంతేకాదు తెలుగు బాషను ఎన్నారైల పిల్లలకు నేర్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

TeluguStop.com - తానా అధ్యక్ష ఎన్నికలు..బరిలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తానా మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచీ రాజకీయ ప్రముఖులు, వ్యపారేత్తలు, సినీ ప్రముఖలు, కవులు, గాయకులూ అందరూ తరలి వెళ్తారు.

ఇంతపెద్ద సంస్థకు రెండేళ్ళ కోసారి ఎన్నికలు జరుగుతాయి.ఈ ఎన్నికల్లో తానాలోని కీలక వ్యక్తులు అందరూ కలిసి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు.అయితే ఇప్పుడు ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.తరాలు మారుతున్నాయి, యువకులు ఎంతో ఉశ్చాహంగా ఉన్నారు, తానా అధ్యక్షులు అవ్వాలనే కోరిక చాలామందిలో నెలకొంది.

దాంతో


ఆనవాయితీగా వస్తున్న ఏకగ్రీవ విధానం కుదరదని, అధ్యక్ష ఎన్నికలకు ఎలక్షన్లు నిర్వహించాలని సభ్యులు పట్టుబట్టారు.దాంతో ఈ ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని విధంగా ముగ్గురు సభ్యులు పోటీ బరిలో నిలిచారు.

తానా ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు గోగినేని శ్రీనివాసరావు , తానా బోర్డ్ మాజీ ఛైర్మెన్ నరేన్ కొడాలి, అలాగే తానా ఫౌండేషన్ అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు.అంతేకాదు ఎవరి ప్రచారాల్లో వాళ్ళు దూసుకుపోతున్నారు.

అయితే తానా లో ఇలాంటి పరిస్థితులు తాము ఎప్పుడూ చూడలేదని, గతంలో అందరూ ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, కానీ ఇప్పుడు ఎన్నికలు రావడం ఆశ్చర్యంగా ఉందని ఇలా అయితే భవిష్యత్తులో తానాలో వర్గ విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ఆందోళన వ్యక్తిం చేస్తున్నారు కొదంరు ఎన్నారైలు.

#TANAElections #America #TANAFoundation #NRIS #Indians

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు