న్యూజెర్సీ లో సిపీఆర్ పై 'తానా'శిక్షణ...!!!

అమెరికాలోని ఉన్న తెలుగు వారి అభివృద్ధి, సంక్షేమం కోసం అక్కడ ఎన్నో తెలుగు సంఘాలు అలాగే భారతీయుల కోసం ఆయా ప్రాంతాలకి చెందిన ఎన్నో భారతీయ సంఘాలు ఉన్నాయి.ముఖ్యంగా అమెరికాలో తెలుగు సంఘాల ఐక్యత ఎంతో గొప్పగా ఉంటుంది.

 Tana Cpr In America-TeluguStop.com

వీటిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అతి పెద్ద సంఘంగా పేరొందింది.తానా కి అమెరికా వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయి.

ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతూ ప్రతీ అంశంపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసే తానా తాజాగా అమెరికాలోని న్యూజెర్సీ లో గుండె సంభందించిన అనారోగ్యాలపై అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమాని ఏర్పాటు చేసింది.గుండె పోటు వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

అలాగే భాడితుడు గుండె పోటుతో ఇబ్బంది పడుతుంటే సత్వర ప్రధమ చికిత్సని ఎలా చేయాలి అనే విషయాన్ని ప్రాక్టికల్ గా చేయించారు.అంతేకాదు

Telugu Cpr America, Tana, Telugu Nri Ups-

ఈ విషయాలకి సంభందిన వీడియోలని స్క్రీన్ పై చూపిస్తూ చెప్పడంతో మరింతగా అవగాహన ఏర్పడిందని శిక్షణకి వచ్చిన ఎన్నారైలు తెలిపారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ ఒక్కరికి తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి కృతజ్ఞతలు తెలిపారు.ఇప్పటి వరకూ సుమారు 100 మందికి శిక్షణ ఇచ్చామని, మరో 500 శిక్షణ ఇచ్చి మరింతమందికి అవగాహన కల్పించడమే తానా ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube