కరోనాపై పుస్తకం...ఆవిష్కరించిన తానా ...!!!!

అమెరికాలో వరుస కరోనా మరణాలు ఎన్నారైలని ఆందోళనలోకి నేట్టేస్తున్నాయి.ఇప్పటికి అమెరికా వ్యాప్తంగా 8500 మంది మృతి చెందగా అందులో 3500 మంది మృతులు న్యూయార్క్ కి చెందినా వారు కావడం గమనార్హం.అంతేకాదు కరోనా భాధితుల సంఖ్య మొత్తం 2.7 లక్షలకి చేరుకుందని తెలుస్తోంది.ఈ నేపధ్యంలో తెలుగు ఎన్నారైలలో మనోధైర్యం నింపడానికి తానా కరోనా పై అవగాహన కార్యక్రమాలు నిపుణులచే వెబ్ నార్ ద్వారా ఏర్పాటు చేయించి, అందరిని అలెర్ట్ చేసింది.అంతేకాదు.

 Coronairus, Tana, America, Corona Satakam Book-TeluguStop.com

నిత్యావసర వస్తువులు అవసరమైన వారికి నేరుగా సరుకులు అందచేసింది.ఈ క్రమంలోనే కరోనాపై మరింత అవగాహన పెంచడానికి, అలాగే ఆత్మస్థైర్యాన్ని నింపి క్రమశిక్షణతో కరోనాపై యుద్ధం చేయడం ఎలా, ప్రపంచాన్ని పరిరక్షించుకోక పొతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి,ప్రకృతికి , జీవరాసులకి కీడు తలపెడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలపై అవగాహన వచ్చేలా పద్యాలతో కూడిన కరోనా శతకం అనే పుస్తకాన్ని అవిక్షరించారు తానా అధ్యక్షులు జై జయ్ శేఖర్.

Telugu America, Corona Satakam, Coronairus, Coronavirus, Tana-

గతంలో చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన అమ్మా నాన్నా ,గురువు శతక పద్యరచన తానా ప్రపంచం అంతటా ఒకే సారి చిన్నరులచే పాడించి చరిత్ర సృష్టించిన విషయం విధితమే.ఇప్పుడు కూడా అదే శ్రీనివాస్ రచనల నుంచీ వచ్చిన కరోనా శతకం పుస్తకాన్ని తానా అధ్యక్షులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చిగురుమళ్ళ మాట్లాడుతూ తన రచనలకి ఊపిరి పోస్తున్న తానాకి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube