అమెరికాలో నివసించే తెలుగు వారి కోసం ఏర్పాటైన తెలుగు సంఘలలోనే అతి పెద్ధది తానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా).తానా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేనంతగా అందరికి చేరువైంది.
తెలుగు వారికి ఎన్నో రకాల సేవలని అందిస్తూ, భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలు తరువాతి తరాలకు అందించడానికి ఎంతగానో కృషి చేస్తోంది.తెలుగు వారు జరుపుకునే ప్రతీ పండుగను వేడుకగా జరిపిస్తూ, అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది తానా.
ఈ క్రమంలోనే,
తానా ఈసారి మహిళల క్రికెట్ పోటీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది తానా.
ఈ పోస్టర్ లో జయ్ తాళ్లూరి(తానా ప్రెసిడెంట్), ఫోటో తో పాటు క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించిన వివరాలను ప్రచురించారు.అయితే.
ఈ పోటీలకు ఎమరాల్డ్ ఫీల్డ్స్, డబ్లిన్ ను వేదికగా ఎంచుకున్నారు.జూలై 19న ఉదయం 8గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్నాయి.
ఇక్కడకి వచ్చే వారి కోసం ఫుడ్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.క్రికెట్ టోర్నమెంట్ మరిన్ని వివరాలకై ఓహెచ్ఐఓ తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అంకం((614)446-4248), ఓహెచ్ఐఓ తానా యూత్ సిద్ధూ రేవూరు ((614)843-112)ను సంప్రదించవచ్చునని ప్రకటించారు.