తానా నవలల పోటీ..2 లక్షల బహుమతి..!!     2018-12-03   14:56:39  IST  Surya

అమెరికా లో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించిన తానా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ, కేవలం అమెరికాలో ఉండే తెలుగు వారికి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారికి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఉండే తెలుగు వారి అభివృద్దికి తెలుగు బాషాభివ్రుద్ది కి సాయం అందిస్తోంది.

ఇదిలాఉంటే..తానా 22వ మహాసభలు 2019 జులై 4, 5, 6 తేదీలలో వాషింగ్టన్‌ నగరంలో జరగబోతున్నాయి. అయితే ఈ సందర్భంగా తెలుగు నవలల పోటీ నిర్వహించి, ఉత్తమ నవలకు రెండు లక్షల రూపాయల బహుమతిని ఇవ్వాలని తానా కార్యవర్గం నిశ్చయించింది.

TANA Conducting Novel Competition For The Year 2019 July 4th-NRI News Updates

2017లో సైతం తానా ఇదేవిధంగా బహుమతులు ప్రకటించింది . తానా నిర్వహించిన నవలల పోటీలో బహుమతికి ఎంపికైన శప్తభూమి..నీల..ఒంటరి నవలలు సాహితీలోకంలో ఒక కదలికను తీసుకొచ్చాయి..ఈ వాతావరణానికి కొనసాగింపుగా తెలుగు సాహిత్యంలోనూ…ప్రపంచ సాహిత్యంలోకం ఉన్నత వరకూ కూడా జీవితాంతం గుర్తుండి పోయేలా మంచి రచనలు వెలికి తీయడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.