తానా ఆధ్వర్యంలో అమెరికాలో వనభోజనాలు..ముఖ్య అతిధిగా..!!!

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘం అయిన తానా తన సేవా కార్యక్రమాలు అంచెలంచెలుగా విసృతం చేస్తూ మరింతగా అమెరికాలోని తెలుగు ప్రజలకి దగ్గర అవుతోంది.తానా తెలుగు సాంప్రదాయాలకి తగ్గట్టుగా ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది.

 Tana Conducted Vanabhojanalu At Us Poorna Malavath-TeluguStop.com

ఈ క్రమంలోనే తెలుగు వారు ఏంతో విశేషంగా జరుపుకునే వినభోజన కార్యక్రమాన్ని తానా నిర్వహించబోతోంది.

Telugu Purna Malavath, Telugu Nri Ups, Vanabhojanalu-

 

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్న తానా అందుకు తగ్గట్టుగా తెలుగు వారికి ఆహ్వానం పలుకుతోంది.ఆదివారం అనగా సెప్టెంబర్ 29 న ఉదయం 11 గంటలకి పెవిలియన్ బి ఎవాన్స్ బర్గ్ స్టేట్ పార్క్ 851 , మేహాల్ రోడ్ కాలేజీవిల్లి నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టుగా తానా ప్రకటించింది.ఈ కార్యమానికి అందరూ ఆహ్వానితులే.
తెలుగు వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపింది.పిల్లలకి పెద్దలకి సాంప్రదాయ పద్దతులలో ఆటల పోటీలు జరుగుతాయని, కబడ్డీ , బాడ్మింటన్ వాలీ బాల్ వంటి ఉల్లాసకరమైన పోటీలు ఉంటాయాని తెలిపింది.

మహిళలు కూడా అన్ని రకాల పోటీలలో పాల్గొనవచ్చు.అంతేకాదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఎవరెస్ట్ అధిరోహించిన తెలుగు తేజం, యువతి పూర్ణ మాలవత్ వస్తున్నట్లుగా సంస్థ కార్యదర్శి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube