అమెరికాలో తెలుగువారి కోసం “తానా వ్యాక్సినేషన్” డ్రైవ్...

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలలో అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) అమెరికాలోని తెలుగువారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది.అన్నిటికంటే ముఖ్యంగా కరోనా సమయంలో తానా అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం సేవా కార్యక్రమాలు ఎంతో మందిని విపత్కర సమయంలో ఆదుకున్నాయి.

 Tana Conducted Covid Vaccination Drive In Dallas, Covid Vaccination Drive,dallas-TeluguStop.com

కరోనా సోకిన తెలుగు కుటుంబాలకు మందుల పంపిణీ, నిత్యావసరాలు ఇలా ఎన్నో సేవలను అందించింది.తాజాగా కోవిడ్ నివారణలో భాగంగా

అమెరికాలోని తెలుగు కుటుంబాలకు ఉచితంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఏర్పాటు చేసింది.

మాస్క్ ధరించండి, టీకాలు వేసుకోండి అంటూ ప్రచారం చేస్తోంది.టీకాలు వేసే కార్యక్రమాన్ని నవంబర్ నెల 3,14,27 తేదీలలో వ్యక్సినేషన్ వేసిన తానా డిసెంబర్ 4 వ తేదీన కూడా డ్రైవ్ నిర్వహించింది.

ఈ డ్రైవ్ లో 5 నుంచీ 11 సంవత్సరాల పిల్లలు , పెద్దలు అలాగే ఎన్నారైల కోసం భారత్ నుంచీ వచ్చిన వారి కుటుంభ సభ్యులకు ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను ఉచితంగా అందించారు.వీరందరికీ ఆరోగ్య భీమా ఉన్నా లేకపోయినా సరే సుమారు 1200 పైగా టీకాలు వేశారు.

తానా మరియు ఫేట్ ఫార్మసీ సంయుక్తంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిందని తానా సభ్యులు ప్రకటించారు.తెలుగు వారికి ఎలాంటి అవసరమైనా తనా ముందు ఉండి సాయం అందిస్తుందని, ఎలాంటి అవసరమైనా, తానా కు తెలియజేస్తే తప్పకుండా సాయం అందిస్తామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులను ఉద్దేశించి తానా ప్రతినిధి సతీష్ కొమ్మన తెలిపారు.

భవిష్యత్తులో కొత్త వేరియంట్ ను మనం ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని ఒమెక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేశారు.తానా ఏర్పాటు చేసే ప్రతీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube