న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో మారుమోగిన “బతుకమ్మ సంబరాలు”

బతుక్కమ్మ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ, మరీ ముఖ్యంగా తెలంగాణా వాసుల ప్రధానమైన పండుగ.ఈ పండుగను ఎక్కువగా తెలంగాణా వాసులు జరుపుకుంటారు.

 Tana Bangaru Batukamma Celebrations At New York Times Squire  , Telugu Nri Orga-TeluguStop.com

దసరాకు రెండు రోజులు ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.ఇక ప్రపంచ వ్బ్యాప్తంగా ఉండే ఎంతో మంది తెలుగు వారు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటారు.

ముఖ్యంగా అమెరికాలో తెలుగు ఎన్నారై సంస్థలు ఈ పండుగను అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరుపుకుంటాయి.తాజాగా అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వివరాలలోకి వెళ్తే.

కరోనా వచ్చిన తరువాత దాదాపు అందరూ కలిసి చేసుకునే పండుగలకు దూరం అయిన తెలుగు సంస్థలు ప్రస్తుతం ఆంక్షలు సదలించడంతో సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నాయి.

తానా ఏర్పాటు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, మేరీల్యాండ్, ప్రాంతాల నుంచీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.సాంప్రదాయమైన కట్టు బొట్టు, పూల దండలతో అలంకరించిన పెద్ద పెద్ద బతుకమ్మలతో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ రోడ్డు మీద ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది.

Telugu Maryland, Jersey, Tanabangaru, Tanalau, Virginia-Telugu NRI

దాదాపు 500 మంది పైగా పాల్గొన్న ఈ వేడుకలు అక్కడి ప్రజలను ఎంతో ఆకర్షించాయి.తానా సభ్యులు మాత్రమే కాకుండా అమెరికన్స్ ఎంతో ఉశ్చాహంగా వేడుకలను ఆస్వాదించారు.పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు బతుకమ్మలతో వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ కరోనా కారణంగా గత ఏడాది పండుగలకు అందరూ దూరంగా ఉన్నామని, ఆన్లైన్ లో పండుగలు జరుపుకున్న తీరుకు, అందరూ కలిసి వచ్చిన జరుపుకునే తీరుకు ఎంతో వ్యత్యాసం ఉందని, పండుగకు విచ్చేసి ఇంత పెద్ద సక్సస్ చేసిన తానా కుటుంభ సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube