ప్రారంభమైన రెండో రోజు సభ...ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక  

Tammineni Unified Elected As Ap Speaker-praja Rajyam Party,tammineni,ycp,అప్పల నాయుడు,తమ్మినేని సీతారాం

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ గా వైసీపీ నేత తమ్మినేని సీతారాం ను సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని కి మంత్రిగా కూడా మంచి అనుభవం ఉంది..

ప్రారంభమైన రెండో రోజు సభ...ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక -Tammineni Unified Elected As AP Speaker

తొలుత టీడీపీ పార్టీ నుంచి 1983 లో తొలిసారిగా ఆయన పోటీ కి దిగారు. అప్పటి నుంచి 2009 వరకు టీడీపీ లోనే కొనసాగారు. తరువాత 2009 లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. అయితే 2014 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ లో చేరి ఎన్నికల్లో పాల్గొనగా సొంత బావమరిది రవికుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి పోటీ కి దిగిన తమ్మినేని విజయం సాధించి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. అయితే ఒక గౌరవప్రదమైన వ్యక్తి స్పీకర్ స్థానం లో ఉండాలన్న ఉద్దేశ్యం తో ఏపీ సీ ఎం జగన్ అండ్ టీమ్ తమ్మినేని ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసారు.

ఈ క్రమంలో ప్రొటెం స్పీకర్ అయిన అప్పల నాయుడు స్పీకర్ గా తమ్మినేని ఎన్నికయ్యారు అన్న విషయాన్నీ ప్రకటించి స్పీకర్ కుర్చీ ని తమ్మినేని కి అందించారు. అయితే స్పీకర్ స్థానంలో తమ్మినేని ని కూర్చోబెట్టే కార్యక్రమానికి ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత చంద్రబాబు దూరం గా ఉన్నట్లు తెలుస్తుంది.

సంప్రదాయం ప్రకారం సీ ఎం,ప్రతిపక్ష నేత ఇద్దరూ కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టాల్సి ఉండగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు దూరంగా ఉన్నారు. కేవలం సీ ఎం జగన్ ఒక్కరే తమ్మినేని ని స్పీకర్ కుర్చీ లో కూర్చోపెట్టారు.