చిరంజీవి అమ్మడు కుమ్ముడుపై సీనియర్ దర్శకుడు సీరియస్     2016-12-29   00:19:28  IST  Raghu V

తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది కత్తి అనే చిత్రం. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కమర్షియల్ పంథాలో సాగిన, గొప్ప విషయాల్ని చెబుతుంది. పల్లెల్లో ప్రజలు పడే కష్టాలని కళ్ళకు కట్టినట్టు చూపించింది. సింపుల్ గా చెప్పాలంటే, బాక్సాఫీస్ కలెక్షన్లు, విమర్శకుల ప్రశంసలు రెండూ లభించాయి ఈ సినిమాకి.

అలాంటి అద్భుతమైన సినిమాని, బలమైన కథని చిరంజీవి ఖైదీనం. 150 పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఉన్న “అమ్మడు కుమ్ముడు” అనే పాట ఇప్పుడు చర్చనీయాంశామైంది. కత్తి లాంటి కథలో, ఇలాంటి పాట ఎక్కడ ఉందని, చిరంజీవి – వినాయక్ కత్తి సినిమాని ఏం చేస్తున్నారని ఇప్పటికే సినిమా ప్రేమికుల గగ్గోలు పెడుతోంటే, ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఆ పాటపై ఘాటుగానే స్పందించారు.

ఖైదీ నం.150 లో చిరంజీవి పాత చిరంజీవి లాగే కనబడుతున్నా, అమ్మడు కుమ్ముడు లాంటి పాట ఇలాంటి కథలో పెట్టడం బాగాలేదని, కత్తిలో అలాంటి సందర్భం లేదు, ఖైదీ కోసం కొత్తగా క్రియేట్ చెసుంటారు. అయితే, చిరంజీవి డ్యాన్సులు, లుక్స్ ఇదంతా కొట్టుకుపోవచ్చు అని, అయినా, తని ఒరువన్ లాంటి సినిమాని చెడిపోకుండా రీమేక్ చేసిన రామ్ చరణ్ ఈ సినిమాలో ఇలాంటి పాటను ఎలా ఒప్పుకున్నాడో అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.