తమన్నా మాములు సాహసం చెయ్యట్లేదుగా.. ఇన్నీ ప్రాజెక్ట్స్ ఒకేసారి?

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్లామర్ బ్యూటీ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Tammanna Is All About Project For The Sake Of Adventure-TeluguStop.com

తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో కూడా నటించింది.ఇక ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో బాగా బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో కూడా ఫోటోల షేర్ లతో ముందుంటుంది.ఇదిలా ఉంటే తమన్నా సాహసం మామూలుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

 Tammanna Is All About Project For The Sake Of Adventure-తమన్నా మాములు సాహసం చెయ్యట్లేదుగా.. ఇన్నీ ప్రాజెక్ట్స్ ఒకేసారి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2005లో శ్రీ అనే సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.కానీ ఈ సినిమా తమన్నాకు అంత గుర్తింపు ఇవ్వలేదు.

ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.అలా వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలలో నటించింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా బాగా అదరగొట్టింది.బుల్లితెర టీవీ షోలో కూడా హోస్టింగ్ చేయడానికి ముందుకు వచ్చింది.

ఇక బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Telugu Adventure, Bollywood Beauty, Gurthunda Seethakalam, Movies, Seetimaar, Tammanna, Tollywood Movie News-Movie

ప్రస్తుతం ఈ బ్యూటీ గోపీచంద్ తో కలిసి సిటీ మార్ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలలో కూడా బిజీగా ఉంది.హిందీలో అంధాదున్, బోలె చుడియన్ సినిమాలలో నటిస్తుంది.

ఇక కన్నడ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో కూడా అవకాశం అందుకుంది.ఇవే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి ఆసక్తి చూపింది.

ప్రస్తుతం వరుసగా తెలుగు, తమిళం, హిందీలో వెబ్ సిరీస్ లో నటిస్తుంది.ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో తన డేట్స్ ను సరిదిద్దుకుంటూ బాగా బిజీ గా ఉంది.

దీంతో తమన్నా అన్ని ప్రాజెక్టులు ఒకేసారి చేయడంతో.తమన్నా అభిమానులు మామూలు సాహసం చేయట్లేదు అంటూ తమన్నాను పొగుడుతున్నారు.

#Seetimaar #Adventure #Tammanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు