వల్లభనేని విషయంలో ఇరుక్కుపోయిన తమ్మినేని సీతారాం

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం చాలా మాటలే చెప్పారు.పార్టీ ఫిరాయింపులను తాము అంగీకరించబోమని, ఎవరైనా సరే రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి తీసుకుంటామని జగన్‌ అన్నారు.

 Tamineni Sitaram Support To Vallabhaneni Vamshi-TeluguStop.com

అలా కాకుండా ఎవరు పార్టీ ఫిరాయించినా చర్యలు తీసుకునే పూర్తి అధికారం మీకే ఇస్తున్నామంటూ స్పీకర్‌కు చెప్పారు.

Telugu Apassembly, Apcm, Taminenisitaram, Tdpmla-

కానీ అవన్నీ ఉత్త మాటలే అని వల్లభనేని వంశీ విషయంలో ఇటు సీఎం జగన్‌, అటు స్పీకర్‌ తమ్మినేని నిరూపించారు.వంశీ టీడీపీకి రాజీనామా చేశారు తప్ప ఎమ్మెల్యే పదవికి చేయలేదు.బహిరంగంగా వైసీపీకి మద్దతు పలికారు.

ఆ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.అలాంటి వ్యక్తికి అసెంబ్లీలో ప్రత్యేకంగా సీటు కేటాయించి, మైకు ఇచ్చి మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

దీనిపై టీడీపీ సభ్యులు ఎంతగా అభ్యంతరం వ్యక్తం చేసినా స్పీకర్‌ వినిపించుకోలేదు.ఇది పార్టీ ఆఫీస్‌ కాదు అసెంబ్లీ అని టీడీపీ సభ్యులు అంటే.గతంలో సమావేశాలు ఓసారి చూస్తే ఆ విషయం మీకే తెలుస్తుందంటూ తమ్మినేని వాళ్లపై ఎదురుదాడికి దిగారు.పైగా ప్రశ్నోత్తరాల సమయంలో వంశీకి ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించారు.

Telugu Apassembly, Apcm, Taminenisitaram, Tdpmla-

నిజానికి ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా అవకాశం ఇవ్వకూడదు.అదే సమయంలో ఈ అంశంపై చర్చించాలని టీడీపీ సభ్యులు డిమాండ్‌ చేయగా.కొశన్‌ హవర్‌లో ఎవరైనా చర్చిస్తారా అంటూ స్పీకర్‌ అనడం గమనార్హం.వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube