ప్రారంభమైన బిగ్ బాస్ షో లో తమిళ సింగర్  

Tamil Singer In Telugu Big Boss-3-

ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ బిగ్ బాస్ షో కు ఉన్న అడ్డంకులు అన్నిటిని తొలగించుకొని మొత్తానికి బిగ్ బాస్-3 షో ఆదివారం అంగరంగ వైభంగా ప్రారంభమైంది.గత కొద్దీ రోజులుగా ఈ షోపై పలు ఆరోపణలు నమోదైన సంగతి తెలిసిందే.చివరికి ఈ విషయం ఢిల్లీ లోని మహిళా కమీషన్ కు కూడా ఫిర్యాదు వరకు వెళ్లడం తో ఈ షో అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Tamil Singer In Telugu Big Boss-3- Telugu Tollywood Movie Cinema Film Latest News Tamil Singer In Telugu Big Boss-3--Tamil Singer In Telugu Big Boss-3-

మరోపక్క ఈ షో హోస్ట్ గా ఉన్న హీరో నాగార్జున ఇంటి బయట కూడా విద్యార్థులు ఆందోళనకు దిగడం తో ఇక ఈ కార్యక్రమం పై అనుమానాలు మొదలయ్యాయి.అయితే ఎన్ని అవాంతరాలు వచ్చినా దిగ్విజయంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అయితే షో లో పాల్గొనబోయే పార్టిసిపెంట్స్ లో మొదటి పార్టిసిపెంట్ గా తీన్మార్ సావిత్రి షో లో అడుగుపెట్టగా, ఆ తరువాత ఒకొక్కరు మిగిలిన 14 మంది షో లో పాల్గొన్నారు.

అయితే ఈ షో లో తమిళ సింగర్ కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Tamil Singer In Telugu Big Boss-3- Telugu Tollywood Movie Cinema Film Latest News Tamil Singer In Telugu Big Boss-3--Tamil Singer In Telugu Big Boss-3-

రాహుల్ సిప్లిగంజ్ ను ఆరో పార్టిసిపెంట్‌గా ఈ షో లో ప్రవేశించాడు.తమిళవాడైన రాహుల్ తెలుగులో పలు హిట్ సినిమాలకు పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

రంగస్థలం సినిమాలోని ‘రంగా.రంగా.రంగస్థలాన’ పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే, ఆ పాటని పాడింది రాహులే.

పార్టిసిపెంట్స్ అందరినీ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పిలిచి షో లోకి ఆహ్వానించారు.