ఎన్నో ఆశలతో అమెరికా పయనం...సౌదీలో లక్షల జీతం...విషాదంగా ముగిసిన యువతి జీవితం...

Tamilnadu Woman Died Road Accident

జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంది, తన తల్లి తండ్రులు తన కోసం, తన చదువు కోసం పడిన కష్టాన్ని నెమరు వేసుకుంటూ చదువుల్లో రాణించింది, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది, అక్కడ కూడా తన అత్యున్నత ప్రతిభ కనబరిచి చదువులు పూర్తి చేసుకుని సౌదీలో లక్షల జీతంతో జీవితం ప్రారభించింది.కన్న తల్లి తండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని భావించిన ఆమె తనతో పాటు తల్లి తండ్రులను సౌదీ తీసుకువెళ్ళింది.

 Tamilnadu Woman Died Road Accident-TeluguStop.com

మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టుగా ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసి పోయింది.వివరాలలోకి వెళ్తే…


 Tamilnadu Woman Died Road Accident-ఎన్నో ఆశలతో అమెరికా పయనం…సౌదీలో లక్షల జీతం…విషాదంగా ముగిసిన యువతి జీవితం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళ నాడుకు చెందిన శ్యామా అనే 21 ఏళ్ళ యువతి చదువుల్లో ముందు ఉండేది.

ఆమె ప్రతిభను చూసిన తల్లి తండ్రులు ఉన్నత చదువుల కోసం అమెరికా పంపారు.అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న కంకార్డియా కాలేజీలో చేరిన శ్యామ చదువుల్లో అక్కడ కూడా రాణించింది.

చదువు కొనసాగిస్తున్న సమయంలోనే ఆమెకు సౌదీ నుంచీ ఓ కంపెనీ లక్షల జీతంతో ఉద్యోగం ఆఫర్ చేయడంతో చదువు పూర్తయిన వెంటనే సౌదీకి వెళ్లి తన కొత్త జీవితం మొదలు పెట్టింది.కూతురు ఉన్నత స్థాయికి చేరుకోవడంతో ఆ తల్లి తండ్రుల ఆనందానికి హద్దేలేదు.

శ్యామా ముందు సౌదీ వెళ్లి అక్కడ ఉద్యోగంలో చేరిన తరువాత ఆమె తల్లి తండ్రులను కూడా ఆమెతో తీసుకువెళ్ళింది.ఈ క్రమంలోనే తల్లి తండ్రులతో కలిసి రియాద్ లోని సందర్సన ప్రదేశాలు చూస్తున్న సమయంలో ఊహించని విధంగా ఆమె కుటుంభంలో విషాదం అలుముకుంది.

వీరు వెళ్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో శ్యామా, ఆమె తల్లి సెల్వి అక్కడికక్కడే మృతి చెందారు.తండ్రి మాత్రం స్వల్ప గాయలాతో బయటపడ్డారు.ఈ ఘటన గురించి తెలుసుకున్న శ్యామా చదువుకున్న అమెరికాలోని కంకార్డియా విశ్వవిద్యాలయం ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని తెలిపింది.

#Saudi #Road #TamilnaduSaudi

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube