గిన్నీస్‌ రికార్డు సాధించిన వైన్‌ షాప్‌ క్యూ.. ఎక్కడో తెలుసా?

45 రోజుల తర్వాత వైన్‌ షాపులు ఓపెన్‌ చేయడంతో దాదాపుగా దేశ వ్యాప్తంగా కూడా వైన్‌ షాపుల వద్ద క్యూ కిలోమీటర్ల మేరకు ఉంది.కిలో మీటర్ల మేరకు ఉందని మాటల్లో చెబుతున్నారు కాని నిజంగా అంతగా క్యూ ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 In Front Of Wine Shop Quew Create The Gunnies Book Of World Record, Tamilanadu,-TeluguStop.com

అయితే వారికి హైదరాబాద్‌లోని ఒక వైన్స్‌ ముందు ఉన్న క్యూ ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.ఇక ప్రస్తుతం మరో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తమిళనాడులో ఈసారి వైన్‌ షాప్‌ ముందు క్యూ ఏకంగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డునే దక్కించుకునే స్థాయిలో ఉంది.

ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా వైన్స్‌ ముందు ఈ స్థాయిలో జనాలు క్యూ కట్టి ఉండరు.

వైన్‌ షాపుకు రెండు వైపుల కలిపి మూడు కిలోమీటర్లకు ఒక మీటరు ఎక్కువే కాని తక్కువ కాకుండా లైన్‌ కట్టారు.అంతగా వైన్స్‌ ముందు క్యూ కట్టారు.

మరి వారందరికి కూడా వైన్స్‌ దొరికాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే వారిలో చాలా మంది కనీసం ముక్కుకు మాస్క్‌ కట్టుకోలేదు.సామాజిక దూరం అనేది అక్కడ కనిపించనే లేదు.

పోలీసులు ఒక్కరు ఇద్దరు ఉన్నా కూడా ఎక్కడ కూడా వారి ప్రభావం కనిపించలేదు.గత 45 రోజులుగా మద్యం లేక నాలుక పీక్కపోతున్న వారు అవి ఓపెన్‌ అవ్వంగానే ఇలా గిన్నీస్‌ రికార్డు సాధించేలా క్యూ కట్టారు.

ఇంతకు ఈ క్యూ ఎక్కడో చెప్పలేదు కదా తమిళనాడులోని కడలూరులోని ఒక మద్యం షాప్‌ వద్ద.అక్కడ అది తప్ప మరోటి లేదు.

మరో వైన్‌ షాప్‌కు వెళ్లాలంటే అయిదు కిలోమీటర్లు వెళ్లాల్సిందే.అందుకే ఆ వైన్స్‌ వద్ద రికార్డు స్థాయి క్యూ ఏర్పడినది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube