రజినీకాంత్ కు కరోనా టెన్షన్.. ఏం జరిగిందంటే..?  

tamilnadu superstar rajinikanth political entry doubtful Rajinikanth, Tamilandu, Political Entry, Coronavirus, Tamilnadu Assembly Elections, Rajinikanth New Party - Telugu Coronavirus, Political Entry, Rajinikanth, Rajinikanth New Party, Tamilandu, Tamilnadu Assembly Elections, Tamilnadu Superstar Rajinikanth Political Entry Doubtful

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.

TeluguStop.com - Tamilnadu Superstar Rajinikanth Political Entry Doubtful

ఈ సంవత్సరం దసరా పండుగ రోజున రజినీకాంత్ పార్టీ పేరును ప్రకటిస్తారని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.

అయితే రజినీకాంత్ ను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోందని.

TeluguStop.com - రజినీకాంత్ కు కరోనా టెన్షన్.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం రిస్క్ అని రజినీకాంత్ భావిస్తున్నారని తెలుస్తోంది.రజినీకాంత్ పార్టీని ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రచారం కోసం రాష్ట్రమంతా తిరగాల్సి ఉంటుంది.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో 70 ఏళ్ల రజినీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

దీంతో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు పార్టీ విషయంలో ముందుకు వెళ్లకూడదని రజినీకాంత్ భావిస్తున్నారు.2017 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ కీలక ప్రకటన చేశారు.అయితే ఇప్పటివరకు రజినీకాంత్ పార్టీ పేరు కానీ మ్యానిఫెస్టో కానీ ప్రకటించలేదు.

దీంతో రజినీకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

డిసెంబర్ నెల చివరినాటికి పరిస్థితుల్లో మార్పు వస్తే జనవరి నుంచి రజినీకాంత్ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు చెబుతున్నారు.డిసెంబర్ నెల 12వ తేదీన రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో ఆరోజు రజినీకాంత్ కొత్త పార్టీ గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.2021 మే నెలలోపు తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

#Tamilandu #Political Entry #Rajinikanth #RajinikanthNew #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamilnadu Superstar Rajinikanth Political Entry Doubtful Related Telugu News,Photos/Pics,Images..