ఇష్టానుసారంగా బయటకు వస్తున్నారని,పోలీసులు ఏమి చేశారంటే

దేశవ్యాప్తంగా చాలా కఠినంగా లాక్ డౌన్ ను పాటించాలి అంటూ కేంద్రం స్పష్టం చేసినప్పటికీ చాలా మంది ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్ల పై జాలిగా తిరుగుతున్నారు.దీనితో ఇలాంటి వారికి వింత వింత పనిష్మెంట్ లు ఇస్తూ పోలీసులు వినూత్నంగా వ్యవహరిస్తున్నారు.

 Corona Virus, Lock Down, Police Warnings, Guntur, Tamil Nadu, Vijayawada, Ambula-TeluguStop.com

మొన్నటికి మొన్న విజయవాడ లో రామ కోటి టైప్ లో “తప్పైపోయింది,క్షమించండి” అంటూ 500 సార్లు రాయమంటే,గుంటూరు లో మాత్రం అనోసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి సెల్ఫీ లు దిగండి అంటూ వారిని తిడుతూ ఉన్న ఒక బ్యానర్ ముందు నిలబెడుతున్నారు.దీనితో జనాలు బయటకు రావడానికి సిగ్గుపడిపోతున్నారు.

అయితే ఇప్పుడు తమిళనాడు పోలీసులు కూడా జాలీగా రోడ్లపై తిరుగుతున్న వారిని కరోనా రోగి ఉన్న వ్యాన్ లోకి ఎక్కించినట్లు తెలుస్తుంది.ఇటీవల రెండు బైకుల పై ఐదుగురు వ్యక్తులు ఎలాంటి మాస్క్ లు కూడా పెట్టుకోకుండా బయటకు వచ్చారు.

దీనితో వారిని పట్టుకున్న పోలీసులు వారిని కరోనా రోగి ఉన్న వ్యాన్ లో ఎక్కించడం తో వారు ఆ వ్యాన్ లోంచి దిగేందుకు నానా ప్రయత్నాలు చేశారు.పోలీసులను ప్రాధేయపడుతూ మరోసారి ఇలా చేయమని వేడుకున్నారు.

దీంతో వారికి మాస్కులు ఇచ్చి మరోసారి ఇలా చేస్తే ఏకంగా కరోనా రోగులు ఉన్న గదిలో బందిస్తామని హెచ్చరించారు.ఇక ట్విస్ట్ ఏంటంటే.

ఆ అంబులెన్సులో ఉన్నది పోలీసు సిబ్బందిలోని ఓ వ్యక్తి.అతనికి ఎలాంటి వ్యాధి లేదు.

కానీ రోడ్లపై తిరిగే వారిని బయపెట్టడం కోసం ఇలా చేసినట్టు వెల్లడించారు.అది నిజం కాకపోయినా అనవసరంగా బయటకు వస్తే మాత్రం కరోనా కాటుకు గురి కావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు లాక్‌డౌన్ పాటించాలని సూచిస్తున్నారు.ప్రసుత్తం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇలా ఇష్టానుసారంగా తిరిగే వారికి సరైన బుద్ది చెప్పారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube