పెళ్లి ఖర్చు 50 లక్షలు అంచనా.. 13 లక్షల్లో కానిచ్చి మిగతాది విరాళం ఇచ్చిన కొత్త జంట..!

కరోనా టైం లో ఓ పెళ్లి జంట తమ మంచి మనసు చాటుకుంది.పెళ్లి ఖర్చు 50 లక్షల దాకా వేసుకున్న ఈ జంట పెళ్లిని 13 లక్షల్లో పూర్తి చేసి మిగతాది కరోనా బాధితుల సహాయార్ధం విరాళాలు అందించారు.

 Tamilnadu Newly Married Couple Donates 37 Lakhs To Charity For Covid Expenses-TeluguStop.com

కరోనా సంక్షోభంలో ఈ జంట తీసుకున్న ఈ నిర్ణయానికి అందరు అభినందిస్తున్నారు.అంతేకాదు ఎంతోమందికి వీరు ఆదర్శంగా నిలిచారు.

తమ పెళ్లిని తక్కువ ఖర్చుతో జరుపుకుని మిగతా డబ్బు విరాళం ఇవ్వాలన్న ఆలోచన అందరు సూపర్ అనేలా చేసింది.తిరుప్పూర్ కు చెందిన అరుల్ ప్రాణేష్, అను ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.

 Tamilnadu Newly Married Couple Donates 37 Lakhs To Charity For Covid Expenses-పెళ్లి ఖర్చు 50 లక్షలు అంచనా.. 13 లక్షల్లో కానిచ్చి మిగతాది విరాళం ఇచ్చిన కొత్త జంట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారి పెళ్లికి 50 లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేసుకున్నారు.అయితే ఈ టైం లో అంత ఖర్చు ఎందుకు అనుకుని తమ పెళ్లిని వీలైనంత తక్కువలో చేసుకున్నారు.

అలా చేసుకున్న వీరి పెళ్లి ఖర్చు 13 లక్షలు అయ్యిందట.మిగిలిన డబ్బుని కరోనా సహాయక చర్యలకు అందించాలని నిర్ణయించుకున్నారు.

పెళ్లికి అతిథులను, బంధు మిత్రులను భారీగా పిలిచే అవకాశం లేదు.అయినా సరే పిలిచిన కొందరు కూడా కొవిడ్ వల్ల తక్కువగా వచ్చారు.మ్యారేజ్ హాల్ ఓనర్ కూడా అడ్వాన్స్ తిరిగి వెనక్కి ఇచ్చేశారట.దీనితో అరుల్, అనులు తిరుప్పూర్ లో వట్టెమాలై అంగళమ్మన్ ఆలయంలో తక్కువమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

వీరి పెళ్లి ఖర్చు 13 లక్షలు కాగా మిగిలిన 37 లక్షలను విరాళంగా ఇచ్చేశారు.ప్రభుత్వ కార్యకలాపాలకు, స్వచ్చంద సేవా సంస్థల కార్యక్రమాలకు ఉపయోగించేలా ఆ డబ్బుని స్థానిక రోటరీ క్లబ్ కు ఇచ్చారు.

#NewlyMarried #37 Lakhs #Donated #TamilnaduNewly #Tamilnadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు