30 ఏళ్లుగా మగాడి వేషంలో స్త్రీ.. ఎందుకో తెలుసా?

ఈ ప్రపంచంలో బంధువులు, స్నేహితుల ప్రేమకంటే తల్లి ప్రేమ చాలా గొప్పది.అమ్మప్రేమకు సాటి ఏది రాదు కూడా.

 Tamilnadu Mother Turns As Man To Take Care Of Her Daughter Details, 30 Years, Me-TeluguStop.com

అయితే తాజాగా తన కూతురి కోసం ఏకంగా 30 ఏళ్ల పాటు మగాడిలా బతికింది ఓ తల్లి.పురుషుడి వేషధారణలో పెయింటింగ్, టీ మాస్టార్, వంట మనిషిగా ఇలా​ ఎన్నో పనులను చేసింది.

ఇన్నేళ్లకు ఈ నిజాన్ని బయటపెట్టింది.

వివరాల్లోకి వెళ్తే.

తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్​ కి 30 ఏళ్ల క్రితం వివాహమైంది.అప్పుడు ఆమె వయస్సు 20 ఏళ్లు.

పెళ్లయిన 15 రోజులకే భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ కావడం వల్ల ఎన్నో తప్పుడు చూపులు ఆమె వెంటపడేవి.

వేధించేవి.అంతలోనే కూతురికి జన్మనిచ్చింది.

అయితే కూతురిని సంరక్షించడం సహా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె ఓ అసాధారణ మార్గాన్ని ఎంచుకుంది.మగాడిలా వేషధారణ మార్చుకుంది.

ఒక్కటి కాదు.రెండు కాదు.

ఏకంగా 30 ఏళ్ల పాటు అనేక సవాళ్లను ఎదుర్కొని టామ్​ బాయ్​లా బతికింది.ఆమే.తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్​.

పేదరికం వల్ల పనికోసం చాలా ప్రాంతాలకు మారాల్సి వచ్చేది.

Telugu Annacchi, Love, Mothers Love, Mothers, Muttu Master, Pechhiyammal, Tamiln

ఎక్కడికెళ్లినా తాను మగాడిలా పరిచయం చేసుకునేది.ఈ క్రమంలోనే స్థానికంగా “అన్నాచ్చి” (పెద్దన్న)గా గుర్తింపు పొందింది.కొన్నాళ్లకు తూతుక్కుడి తిరిగొచ్చి.క్రాప్​ హెయిర్​ కట్​, మగాడి దుస్తుల్లో పురుషుడిలానే జీవించసాగింది. టీ, పరోటా షాపుల్లో పనిచేసి.ముత్తు మాస్టర్​గా పేరుగాంచింది.

పెచ్చియామ్మాల్ కూతురు మాట్లాడుతూ…”పనికి వెళ్లి వచ్చే క్రమంలో ఎదురైన వేధింపులతో అమ్మ మగాడిగా వేషధారణ మార్చింది.అమ్మ ఇలా చేసినందుకు గర్వంగా ఉంది.

అయితే ధ్రువీకరణ పత్రాల్లో పురుషుడిలా ఉండటం వల్ల పింఛను తీసుకోవడంలో అమ్మ ఇబ్బందులు ఎదుర్కుంటోంది.అది పరిష్కారమై అమ్మకు పింఛను అందితే ఆమెకు ఎంతో సాయంగా ఉంటుంది” అని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube