అక్కడ ఆ రోజు మొబైల్స్ బంద్,కారణం ఏమిటంటే  

Tamilnadu Government Takes A Sensational Decision-now A Days Every One Hand In One Mobile,tamilnadu Government

మొబైల్ గురించి చిన్నా పెద్ద ఎవరిని కదిపినా కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు.నా మొబైల్ లో ఈ యాప్ ఉంది,నా మొబైల్ లో ఆ యాప్ ఉంది అంటూ పెద్దలు చర్చించుకుంటుండగా, చిన్నారులు మాత్రం నా మొబైల్ లో ఆ గేమ్ ఆడా,ఈ గేమ్ ఆడా అంటూ చెప్పుకుంటూ ఉంటారు.

Tamilnadu Government Takes A Sensational Decision-now A Days Every One Hand In One Mobile,tamilnadu Government-Tamilnadu Government Takes A Sensational Decision-Now Days Every One Hand In Mobile

ఈ మొబైల్ పిచ్చిలో పది పక్కన ఉన్న మనిషితో మనసువిప్పి మాట్లాడడానికి కూడా కుదరడం లేదు.మన దైనందిన జీవితంలో మనుషులు మొబైల్స్ కు ఎంతగా బానిసలు అయిపోయారు అన్న విషయం కు చాలానే ఉదాహరణలు ఉన్నాయి.

అయితే ఇంతకీ ఈ మొబైల్ పురాణం ఎందుకు అని అనుకుంటున్నారా.

ఈ మొబైల్ కారణంగా పిల్లలు,తల్లిదండ్రుల మధ్య బాగా గ్యాప్ పెరిగింది అని భావించిన తమిళనాడు ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మొబైల్ కారణంగా ఒకరి నొకరు మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క చిన్నారి,తల్లిదండ్రుల మధ్య సంబంధాలు దాదాపుగా ఇలానే ఉన్నాయి అని తమిళనాడు ప్రభుత్వం మొబైల్ ను నిషేధించింది.అయితే మొబైల్ లేకుంటే జీవితమే ఆగిపోతుంది అని భావించే వారికి ఇది మింగుడు పడని వార్త అని చెప్పాలి.

కానీ ఈ మొబైల్స్ బంద్ అనేది కేవలం నవంబర్ 14 వ తేదీ ఒక్కరోజు మాత్రమే అని తెలుస్తుంది.నవంబర్ 14 న నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవం పురస్కరించుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పిల్లలు,తల్లిదండ్రుల మధ్య చక్కని సంబంధాలు కొనసాగాలన్న ఉద్దేశ్యం తో తమిళ సర్కార్ ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు అంటే ఒక గంట పాటు సెల్ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేసి పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలని తెలిపింది.

ఆ సమయంలో వారి గురించి అన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయండని రాష్ట్ర విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఓ సర్య్కులర్ పంపింది.అంతేకాదు కనీసం వారంలో ఒకసారి అయినా ఇలా చేస్తే మరింత బావుంటుందని రాష్ట్ర విద్యాశాఖ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.ఇక మరి ఎంత మంది ఈ పద్దతిని ఫాలో అయ్యి తమతమ పిల్లలకు మరింత దగ్గర అవుతారు అన్న విషయం తెలియాల్సి ఉంది.