తమిళనాడు 14 రోజులు లాక్ డౌన్..!

దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసుల ఉదృతి అధికమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ కు సంబందించిన అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పచెప్పింది.దేశ ఆర్ధిక వ్యవస్థని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈసారి లాక్ డౌన్ ప్రకటించడంల్లో వెనుకంజ వేస్తుంది.

 Tamilnadu Government Announced Lockdown May 10th To 24th, Announced, Corona Effe-TeluguStop.com

అయితే రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజల నిరసనలు ఎక్కువయ్యాయి.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రెండు వారాల లాక్ డౌన్ ప్రకటించాయి.

ఈ క్రమంలో తమిళనాడులో కూడా పాక్షిక లాక్ డౌన్ ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్.

తమిళనాడులో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న కారణంగా 14 రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు ప్రకటించారు.కేసులు రోజు రోజుకి పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మే 10 నుండి 24 వరకు రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ అమలు చేయాలని ప్రకటించింది.తప్పనిసరి పరిస్థితుల కారణంగా షట్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

అయితే కూరగాయలు, నాన్ వెజ్, నిత్యావసరాలకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్ చేసే అనుమతి ఇచ్చారు.ఇక ఈ 14 రోజులు మద్యం షాపులు పూర్తిగా మూసేస్తారని తెలుస్తుంది.రెస్టారెంట్లలో టేక్ ఎవే సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.14 రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ టైం లో పెట్రోల్, డీజిల్ బంకులు తెరచి ఉంటాయని.మే 10న మొదలయ్యే రెండు వారాల లాక్ డౌన్ కు ప్రజలు సిద్ధం అవ్వాలని శని, ఆది వారాల్లో ఉదయం 6 గంటల నుండి 9 గంటల షాపులు తెరచి ఉంచుతారని తెలుస్తుంది.అటు ఏపీలో కూడా మధ్యాహ్నం నుండి కర్ఫ్యూ విధించగా తెలంగాణాలో మాత్రం రాత్రి కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube