మరో సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్..!!

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత స్టాలిన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.వి పక్షాలతో కలిసి అనేక నిర్ణయాలు చర్చించి మరి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.

 Tamilnadu Cm Stalin Sensatational Decision Tamilnadu, Stalin ,tamilnadu , Tamila-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా తమిళనాడు పోలీసులకు వరాల జల్లులు తాజాగా కురిపించారు.పోలీసులు 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉండటంతో.

ఇక నుండి పోలీసులు పనిచేస్తున్న జిల్లాలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని.కల్పిస్తూ స్టాలిన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

అంత మాత్రమే కాక రిస్క్ అలవెన్స్ నీ ఎన్ని వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అదే క్రమంలో పోలీస్ భార్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, అంతేకాకుండా చెన్నైలో థౌజండ్ లైట్స్ ప్రాంతంలో అన్ని సదుపాయాలతో దాదాపు రెండు వందల డబ్భై ఐదు కోట్ల రూపాయలతో పోలీస్ క్వార్టర్స్ కొత్తగా నిర్మిస్తున్నట్లు స్టాలిన్ స్పష్టం చేశారు.

 చాలావరకు సామాన్య ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలు అందుబాటులో ఉండే విధంగా స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్క తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు పోలీసుల విషయంలో స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube