శరణ్య పెద్ద కూతురు పెళ్లి.. చీఫ్ గెస్ట్ గా సీఎం?

ఒకప్పటి తెలుగు సినీ నటి శరణ్య పరిచయం గురించి అందరికీ తెలిసిందే.నటిగానే కాకుండా మోడల్ గా, నేపథ్య గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Tamilnadu Cm Mk Stalin Attends Heroine Sharanya Elder Daughter Priyadarshi Weddi-TeluguStop.com

ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.ఇక 1987లో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1995లో రచయిత, నటుడు, ప్రముఖ దర్శకుడు పొన్ వన్నన్ ను పెళ్లి చేసుకుంది.ఇక వీళ్లకు ప్రియదర్శిని, చాందిని అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.1996 వరకు నటించిన ఈమె ఇండస్ట్రీకి దూరం కాగా తిరిగి 2003లో ఇండస్ట్రీకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక ప్రస్తుతం ఎక్కువగా తల్లి, భార్య పాత్రలలో మెప్పిస్తుంది.

ఇదిలా ఉంటే చెన్నైలో తన పెద్ద కుమార్తె ప్రియదర్శిని వివాహ రిసెప్షన్ జరుగగా ఆ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చి ఆ నూతన దంపతులను ఆశీర్వదించారు.

Telugu Cm Mk Stalin, Sharanya, Mk Stalin, Priyankaarul, Saranya, Tamilnadu, Tami

సోమవారం రోజు జరిగిన ఈ వేడుకకు స్టాలిన్ తన భార్య దుర్గా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమోళి పలువురు రాజకీయ నాయకులు శరణ్య పెద్ద కూతురు వేడుకకు హాజరయ్యారు.ఇక వారిని ఆశీర్వదించగా నూతన జంటకు స్టాలిన్ మొక్కలతో కూడిన గ్రీన్ బాస్కెట్ లను బహుమతిగా ఇచ్చారు.

Telugu Cm Mk Stalin, Sharanya, Mk Stalin, Priyankaarul, Saranya, Tamilnadu, Tami

అంతే కాకుండా పలువురు నటులు కూడా ఈ వేడుకకు హాజరు కాగా శరణ్య తో గ్యాంగ్ లీడర్ లో నటించిన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యింది.ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఇప్పటికి కూడా శరణ్య ఇండస్ట్రీలో ఉండగా పలు పాత్రలలో బాగా మెప్పిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube