కరోనా వల్ల అనాథలుగా మారిన చిన్నారుల కోసం సిఎం స్టాలిన్ సంచలన నిర్ణయం..!

తమిళనాడు సిఎం ఎం.కే స్టాలిన్ తన మార్క్ పరిపాలన చూపిస్తున్నారు.

 Tamilnadu Cm Mk Stalin Announced 5 Lakhs For Childrens Who Lost Parents With Cor-TeluguStop.com

ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సంచలన నిర్ణయాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు.ఇక లేటెస్ట్ గా సిఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాహలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు స్టాలిన్.అలాంటి అనాథలకు 5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు స్టాలిన్.

ఈ మొత్తాన్ని వారి పేరిట ఫిక్సుడు డిపాజిట్ చేస్తామని.వారికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత వడ్డీతో సహా మొత్తం డబ్బు తీసుకోవచ్చని అన్నారు.

పేరెంట్స్ లో ఎవరినో ఒకరిని కోల్పోయిన వారికి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు.అంతేకాదు అనాథలైన చిన్నారుల సం రక్షణ ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు.వారి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.డిగ్రీ పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

ప్రభుత్వ హాస్టల్స్ లో వారికి వసతి ఏర్పాటు చేస్తామని అన్నారు.హాస్టల్స్ లో కాకుండా బంధువుల ఇళ్లలో ఉంటే అలాంటి వారికి ప్రతి నెల 3000 రూపాయలు సాయం అందిస్తామని అన్నారు.

అనాథలైన చిన్నారుల మంచి చెడ్డలను చూసుకునేందుకు వీలుగా జిల్లా స్థాయిలో స్పెషల్ కమిటీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube