అమ్మ ఆస్తులు ఇంతింత కాదయా?

అమ్మంటే అంతులేని సొమ్మురా … అని ఓ సినిమా కవి చక్కగా చెప్పారు.అమ్మ అంటే కన్న తల్లి.

 Jayalalithaa’s Assets Worth Rs 113 Crore-TeluguStop.com

ఆమె మన దగ్గర ఉంటే అంతకు మించిన సంపద అక్కరలేదని, ఆమె ఉంటే అదే గొప్ప ఆస్తి అని కవి ఇచ్చిన సందేశం.దేశంలో ఒక అమ్మ ఉంది.

ఆమె పేరు జయలలిత.తమిళనాడు ముఖ్యమంత్రి.

మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.అన్నా డీఎంకేకు ఆమె గొప్ప ఆస్తి.

కానీ ఆమెకు ఉన్నసిరిసంపదలు ఆమె కంటే ఎక్కువ.

ఏకాకి జీవితం నాది అంటూ ఒక సినిమాలో హీరో పాడుకున్నట్లుగా అమ్మ ఒంటరి.

అంటే తనకంటూ కుటుంబం లేదు.కానీ ఆమె ఆస్తులు పర్వతం మాదిరిగా పెరుగుతూనే ఉన్నాయి.

ఈ సంపద సక్రమం అని ఆమె చెబుతున్నారు.కానీ అక్రమం అనే ఆరోపణలు ఉన్నాయి.2013లో జయ ఆస్తులు 51 కోట్లు.కానీ మూడేళ్లలో విపరీతంగా పెరిగిపోయాయి.2016లో అంటే ఈ ఏడాదిలో ఆస్తుల విలువ 113 కోట్లు.

గత అయిదు సంవత్సరాల్లో అమ్మ ఆస్తులు 62 కోట్ల మేరకు పెరిగాయని తమిళనాడు ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థలు తెలిపాయి.

ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఈమె ఆస్తులే టాప్.జయలలిత అక్రమాస్తుల కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉంది.బెంగళూరులోని ప్రత్యేక కోర్టు అమ్మను అక్రమాస్తుల కేసులో దోషిగా తేల్చి శిక్ష విధించగా, కర్నాటక హై కోర్టు నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలుసు.దీంతో జయ ప్రత్యర్ధులు సుప్రీం కోర్టులో సవాలు చేసారు.

అక్కడ తీర్పు మీద అమ్మ రాజకీయ భవిష్యత్తు ఆధార పడివుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube