కుప్పకూలిన భవనాలు, 15 మంది మృతి  

Tamilnadu Building Collapse-koyambathur,rukhmini,tamilnadu,womens And Childrens Are Injured

భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు.ఇందులో భాగంగా కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది.వర్షాలకు నాని నాలుగు భవనాలు కుప్పకూలాయి.

Tamilnadu Building Collapse-koyambathur,rukhmini,tamilnadu,womens And Childrens Are Injured Telugu Viral News Tamilnadu Building Collapse-koyambathur Rukhmini Tamilnadu Womens And Childrens Are Injure-Tamilnadu Building Collapse-Koyambathur Rukhmini Tamilnadu Womens And Childrens Are Injured

ఈ ఘటనల్లో 15 మందికిపై మృతి చెందారు.ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో.అందరూ నిద్రలో ఉన్నారు.దీంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు.కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.

చనిపోయిన వారిలో పది మంది మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.వారిలో పదహారేళ్ల హరిసుధ , శివకామి, నథియా, వైదేగి, తిలగవతి, అర్కని, రుక్మిణి, నివేథ, చిన్నామల్, గురు, రామ్‌నాథ్, ఆనంద్ కుమార్, అక్షయ, ఏడేళ్ల లోగురామ్ తదితరులు ఉన్నారు.కాగా చెన్నై, కాంచిపురం, కడలూరు, మధురై, కోయంబత్తూరు జిల్లాలో భారీ వర్షం పడుతుంది.దీంతో ఆయా జిల్లాలో స్కూల్స్‌కి, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

మరో రెండు రోజుల పాటు అక్కడ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.