ఇదేందయ్యా ఇది : ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే సృష్టించారు  

A fake SBI branch was created in Tamilnadu, Tamilnadu, A Fake SBI Branch, Bank Manager, SBI Bank Furniture, Police Ride On Fake SBI Branch, Police Investigation - Telugu A Fake Sbi Branch, Bank Manager, Police Investigation, Police Ride On Fake Sbi Branch, Sbi Bank Furniture, Tamilnadu

మోసగాళ్లకు మోసగాళ్ళు అన్నట్లు వీళ్లు కేటుగాళ్ల కంటే కేటుగాళ్లు.అవును ఎందుకంటే వీరు ఏకంగా ఓ నకిలీ బ్యాంకును సృష్టించారు కాబట్టి.

 Tamilnadu A Fake Sbi Branch Bank Manager

ఎవరైనా బ్యాంకు కన్నం వేస్తామని ఆలోచిస్తారు కానీ, వీరు ఏకంగా ఒక నకిలీ బ్యాంకును సృష్టించారు.మామూలుగా ఎవరైనా బ్యాంకులో అప్పు తీసుకొని కట్టకుండా వేరే దేశాలకు వెళ్లి పోయిన వారిని కూడా చూస్తుంటాం.

కానీ ఇన్ని దారుణాలు జరిగినా ప్రజలు మాత్రం బ్యాంకులపై చాలా నమ్మకం.ఈ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టారు కొందరు అక్రమార్కులు.

ఇదేందయ్యా ఇది : ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే సృష్టించారు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఏకంగా నకిలీ ఎస్బిఐ బ్రాంచ్ ను స్థాపించేశారు.

ఇకపోతే ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లా కడలూరు జిల్లా పన్ రూటీ లో గత మూడు నెలల నుండి సాఫీగా ఓ నకిలీ ఎస్బిఐ బ్రాంచ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

అయితే ఓ కస్టమర్ బ్యాంకుకు వెళ్లగా అక్కడ వాళ్ళ వ్యవహారం పై అనుమానం రావడంతో తన అకౌంట్ ఉన్న బ్యాంకు మేనేజర్ కు కలిసి ఆ విషయాన్ని తెలిపాడు.

ఇకపోతే సదరు బ్రాంచ్ మేనేజర్ ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు చర్చించగా అక్కడ కేవలం రెండు బ్రాంచీలు అనుమతి ఉందని ఇది ఎక్కడిదో తెలియదని తెలిపారు.దీంతో వెంటనే ఆ ఎస్బీఐ బ్రాంచ్ పై అధికారులు దాడి చేసి, అక్కడ పరిశీలించగా ఎస్బిఐ అధికారుల నోట మాట రాకుండా అయిపోయింది.దానికి గల కారణం ఎస్బీఐ బ్యాంకు లో ఎలా ఉంటుందో అచ్చం ఫర్నిచర్ తో సహా అన్ని సదుపాయాలు అచ్చు గుద్దినట్టు ఉండడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

దీంతో వారు పోలీసుల కు సమాచారం అందించడంతో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.అలాగే నకిలీ బ్యాంకు కు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నారు

.

#Bank Manager #Tamilnadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamilnadu A Fake Sbi Branch Bank Manager Related Telugu News,Photos/Pics,Images..